రాజకీయ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్… ఏమన్నారంటే?
TeluguStop.com
సినీ నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.
ఈయన తన కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బేధాభిప్రాయాలు కారణంగా పెద్ద ఎత్తున గొడవలకు దిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ గొడవలు నేపథ్యంలో తనకంటూ ఓ బలం ఉండాలని భావించిన మనోజ్ దంపతులు రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలు ఉన్నట్టు వార్తలు వినిపించాయి.
భూమా మౌనిక ( Bhuma Mounika ) కుటుంబానికి ఎంతో రాజకీయ నేపథ్యం ఉంది ఇప్పటికే తన అక్క అఖిల ప్రియ ( Akhila Priya ) తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే తాము కూడా రాజకీయాలలోకి వస్తే తమకు మరింత బలం ఉంటుందని భావించిన ఈ దంపతులు త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ( Political Entry ) ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇప్పటికే అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో ఉండగా మౌనిక మనోజ్ దంపతులు మాత్రం జనసేన ( Janasena ) పార్టీలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఇక డిసెంబర్ 16వ తేదీ శోభ నాగిరెడ్డి జయంతి కావడంతో మంచు మనోజ్ మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు చేరుకున్నారు.
"""/" /
ఇలా తన భార్య బిడ్డలతో మనోజ్ ఆళ్లగడ్డకు చేరుకోవడమే కాకుండా తన అత్తయ్యకు నివాళులు అర్పించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఈయనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ప్రస్తుతం తాను మాట్లాడే పరిస్థితులలో లేనని ఈయన వెల్లడించారు.
మా అత్తయ్య జయంతి సందర్భంగా మొదటిసారి నా కూతురు దేవసేన శోభను తీసుకొని ఇక్కడికి వచ్చానని తెలిపారు.
అత్తయ్య జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదు.మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చా ఇక్కడ బంధువులు అభిమానులు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించారనీ మనోజ్ తెలిపారు.
ఇక రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేనని ఈయన చెప్పడంతో బహుశా తనకు రాజకీయాలలోకి రావాలనే ఆలోచన ఉందని అందుకే ఇలాంటి సమాధానం చెప్పారని పలువురు భావిస్తున్నారు.
హార్ట్ టచింగ్ వీడియో: భార్యను పర్ఫెక్ట్‌గా ఫొటో తీయడానికి నేలపై కూర్చున్న వృద్ధుడు!