ఆ పోలీస్ కనుక ఎదుట పడితే మంచు లక్ష్మి చితకొట్టేలా ఉంది

మంచు లక్ష్మి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఆమె అనేక సందర్భాల్లో తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు.

ఇటీవల మధ్య ప్రదేశ్ భోపాల్ లో ఒక పోలీస్ నడి రోడ్డు పైన స్కూల్ విద్యార్థిని ని లైంగికంగా వేధించాడు.

దాదాపు 5 నిమిషాల పాటు రోడ్డు పై అతడు చేసిన వికృత క్రీడ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా లో వైరల్ అయింది.

కొన్ని గంటల్లోనే అతడిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.ఆ పోలీసు పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆదేశించారు.

ఇప్పటికే అతడు భోపాల్ జైల్లో ఉన్నాడు.అయినా కూడా సోషల్ మీడియా జనాలు అతడిని తీవ్రంగా విమర్శిస్తూ తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విషయమై మంచు లక్ష్మి స్పందించారు.ఆ పోలీసు అధికారి పై తీవ్ర స్వరం తో మండి పడ్డారు.

ఇలాంటి నీచులను ఏం చేసినా పాపం లేదన్నట్లుగా ఆగ్రహం తో ఊగి పోయారు.

ఆ పోలీస్ అధికారి ఒక వేళ మంచు లక్ష్మి ఎదురుగా ఉంటే చితక్కొట్టే అంత కోపం తో ఆమె ఉన్నట్లుగా వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పోలీస్ లైంగిక వేధింపుల వీడియో ప్రస్తుతం సమాజం లో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది అంటూ ఆడ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కూడా ఇలాంటి నీచులను పద్ధతి మార్చలేక పోతున్నాయి.

అత్యంత దారుణమైన ప్రవర్తన కలిగి ఉన్న ఇలాంటి నీచులను ఆలస్యం చేయకుండా వెంటనే శిక్ష పడాలని సోషల్ మీడియా జనాలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ విషయం లో మంచు లక్ష్మి స్పందన బాగుందంటూ చాలా మంది ఆమె ను అభినందిస్తున్నారు.

ఫ్యామిలీతో దేవర షూటింగ్ కి పయనమైన తారక్.. వైరల్ అవుతున్న ఫోటోలు!