తెలుగు సినీ వారసురాళ్ల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు మోహన్ బాబు ( Mohan Babu ) ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇండస్ట్రీలో ఈమె పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం కష్టపడుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చినటువంటి వారసురాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
"""/" /
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ తాను కెరియర్ మొదట్లో హాలీవుడ్ ( Holly Wood )ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని అక్కడ పని చేశానని తెలిపారు.
అయితే తాను ఇక్కడికి రాకుండా అక్కడే ఉండి ఉంటే ఈ పది సంవత్సరాల కాలంలో తన లైఫ్ ఎక్కడో ఉండేదని ఈమె తెలియజేశారు.
ఆ భగవంతుడు దయవల్ల నాకు తిరిగి హాలీవుడ్ అవకాశాలు వస్తే బాగుండని తాను కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ విధంగా మంచు లక్ష్మి తనకు హాలీవుడ్ సినిమా అవకాశాలు రావాలని కోరుకోవడం వెనుక కారణం లేకపోలేదు.
"""/" /
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు (Telugu Heroines).ఏమాత్రం వాల్యూ లేదని ప్రేక్షకులు వారిని ఆదరించడం లేదని తెలిపారు.
తెలుగువారికి ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన హీరోయిన్స్ అంటేనే ఇష్టం అని తెలిపారు.
అయితే ఇతర రాష్ట్రాలలో వారిని ఇష్టపడినట్టు తెలుగువారిని ఒక్క శాతం ఇష్టపడిన వారు ఎక్కడో ఉంటారని ఈమె తెలిపారు.
ఇక్కడే పుట్టిన నిహారిక నటనపరంగా ఎందులో తక్కువ అలాగే బిందువం మాధవి, శివాని, శివాత్మిక, మధుషాలిని,వీరందరిలోనూ ఏమి తక్కువ అందంతోపాటు నటనలు ఎంతో టాలెంట్ కలిగి ఉంది కానీ వీరికి ఎందుకు అవకాశాలు రావడం లేదంటూ ఈమె ఫైర్ అయ్యారు.
అయితే ప్రేక్షకుల ఆలోచన మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలు కూడా ఇతర రాష్ట్రాల హీరోయిన్ల పైన ఆసక్తి చూపుతున్నారు అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?