మంచు వారి సన్నాఫ్ ఇండియా ఓటీటీ ఉందా? లేదా?

మంచు మోహన్‌ బాబు చాలా కాలం తర్వాత లీడ్ రోల్‌ లో నటించిన సన్నాఫ్ ఇండియా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా ను మంచు విష్ణు నిర్మించాడు.వీఎఫ్ఎక్స్‌ కు భారీ గా ఖర్చు చేశాం అని.

ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక కళా కండం అంటూ యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా మంచు విష్ణు మరియు మోహన్ బాబు పదే పదే చెప్పారు.

దానికి తోడు ఈ సినిమా లో చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇవ్వడం వల్ల కూడా అంచనాలు భారీ గా పెరిగాయి.

అంచనాలు ఏమాత్రం ఈ సినిమా అందుకోలేక పోయింది.దానికి తోడు ఆ మద్య మోహన్ బాబు మరియు మంచు విష్ణు లు చేసిన హడావుడి కారనంగా సినిమా కు దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

50 కోట్లు వసూళ్లు చేస్తుందన్న సినిమా కనీసం ఒక్క కోటి కాదు కదా కనీసం 50 లక్షల షేర్‌ ను రాబట్టలేక పోయింది.

మోహన్‌ బాబు కెరీర్‌ లో ఇలాంటి ఒక దారుణమైన ప్లాప్‌ పడుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు.

ఇలాంటి దారుణాన్ని చూడటం కోసమా ఉన్నది అంటూ అభిమానులు నెత్తి నోరు కొట్టుకున్నారు.

సరే థియేటర్లలో సినిమా ఎలాగూ ఆడలేదు.కనీసం ఓటీటీ లో అయినా సినిమా ఆడుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆడటం ఏమో కాని అసలు ఓటీటీ లో వచ్చే పరిస్థితి లేదు.సినిమా ను భారీ బడ్జెట్‌ తో నిర్మించడం వల్ల భారీ మొత్తానికి ఈ సినిమాను అమ్ముతాము అంటూ మంచు విష్ణు భీష్మించుకు కూర్చున్నాడు.

దాంతో సినిమా ఓటీటీ విడుదల విషయంలో అనుమానాలు ఉన్నాయి.ఇప్పటి వరకు సన్నాఫ్ ఇండియా ఓటీటీ స్ట్రీమింగ్ లేదు.

ముందు ముందు ఉంటుందా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు.

“ఎంత తింటావ్‌, రా?” అంటూ నోట్లు విసిరిన జనం.. అవినీతి అధికారి ఏం చేశాడంటే..?