దళిత బంధు పథకం ద్వారా నిర్మించిన రైస్ మిల్లులను సందర్శించిన రసమయి
TeluguStop.com
దళిత బంధు పథకం ద్వారా దళితులను రైసు మిల్లులకు , పెట్రోలు బంకులకు , హోటళ్లకు యజమానులను చేయడమనేది నా కళలో కూడా ఊహించలేదని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివారులోని విజయలక్ష్మి రైస్ మిల్లు ఇండస్ట్రీని శుక్రవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించారు.
ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద పదిర గ్రామానికి చెందిన సురేందర్ , డప్పుల లింగం, విజయ్ కుమార్ మరికొంతమంది కలిసి దుమాల గ్రామ శివారులో విజయలక్ష్మి రైస్ మిల్లు ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవల ప్రారంభించుకున్నారు.
ఇట్టి రైస్ మిల్లును మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( Manakondur MLA Rasamayi Balakishan )శుక్రవారం సందర్శించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విజయలక్ష్మి రైస్ మిల్ ఇండస్ట్రీని దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటుచేసిన రైస్ మిల్లును శుక్రవారం ప్రత్యక్షంగా చూడడం జరిగిందని చాలా గర్వకారణంగా ఉందని కళ్ళల్లో కూడా ఆనందంగా ఉందన్నారు.
తరతరాలుగా వివక్షత వెనుకబాటుకు గురైన దళితుల బ్రతుకుల్లో అభివృద్ధి రేఖలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సంకల్పం కేటీఆర్ యొక్క ఆశయాలు అని ఆయన అన్నారు.
ఇవన్నీ కూడా ఈ విజయలక్ష్మి రైస్ మిల్లు ఇండస్ట్రీలో కనబడుతున్నాయని నేను మానకొండూరు నియోజకవర్గం నుండి రావడం జరిగిందని ఎందుకంటే రానున్న దళిత బంధు పథకం( Dalit Bandhu Scheme )లో ఇటువంటి రైస్ మిల్లు ఇండస్ట్రీని ప్రతి నియోజకవర్గంలో ప్రతి దళిత బంధు పథకంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా వచ్చి చూడడం జరిగిందన్నారు.
ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టిన సురేందర్ , డప్పుల లింగం, విజయ్ కుమార్ ల కొంతమంది మిత్రులు కలిసి స్ఫూర్తిదాయకంగా ఏర్పాటు చేసుకొని నిలిచినందుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దళితుల బతుకులు అంటే రైస్ మిల్లులో హమాలి పని చేసే వాళ్ళు అంతేకాకుండా వడ్లు ఊడ్చేవారు అక్కడ అనేక పనులు చేసేవారు అలాంటి వారిని మా కళ్ళ ముందే రైస్ మిల్లులకు యజమానులను చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యంగా మంత్రి కేటీఆర్( Minister KTR ) దళిత బందులో మొదటి ప్రయోగం చాలా పట్టుదలతో తీసుకొని దళితుల బ్రతుకులు బాగుపడాలంటే ఇండస్ట్రీలతో ఎదగాలని ఆలోచనతో రైస్ మిల్లులు గాని , పెట్రోల్ బంకులు గాని, పెద్ద హోటల్స్ గాని ఆయన చాలా చొరవ తీసుకొని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్శనలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎల్లారెడ్డిపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, కదిరే శ్రీనివాస్ గౌడ్ , నాగరాజు ,హాన్మంత్ తదితరులు పాల్గొన్నారు.
“ఫాస్ట్‌గా రా.. మూడ్‌లో ఉన్నా”: ఉబర్ డ్రైవర్ అసభ్య మెసేజ్‌లు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..