నిన్నటి వరకు మేనేజర్…నేడు మున్సిపల్ కమిషనర్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ గా ఏ.అశోక్ రెడ్డి ( A.

Ashok Reddy )నియామకమయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

కమిషనర్ గా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీపై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు.గురువారం వరకు నేరేడుచర్ల మున్సిపల్ మేనేజర్ గా విధులు నిర్వహించిన అశోక్ రెడ్డిని ప్రభుత్వం కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ను పట్టణంలోని ప్రజా ప్రతినిధులు,పుర ప్రముఖులు,రాజకీయ నేతలు,పలువురు శాలువలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

వైరల్ వీడియో: భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన రోహిత్.. ఫైనల్లో టీమిండియా..