2.5 లక్షల మందితో ‘మన టీడీపీ’.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు..!?

ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అంతేకాదు ఫేక్ కంటెంట్ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు బయటకు వస్తున్నాయని తెలుస్తోంది.

ఇందుకోసం వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడంతో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా పలు ఫ్లాట్ ఫామ్స్ నుంచి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ( YCP )పై అసత్య ప్రచారాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ టీడీపీ.ఈ ఎన్నికలకు జనసేన, బీజేపీలతో కలిసి బరిలోకి దిగుతుంది.

టీడీపీకి కొన్ని పత్రికలు, ఛానల్స్ మద్ధతు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా పలు కథనాలను సైతం ప్రచారం చేస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా సోషల్ మీడియాను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని సమాచారం.

ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారాలను చేసేందుకు టీడీపీ( TDP ) సిద్ధం అయిందంటూ ఏపీలో కొందరు విమర్శిస్తున్నారని తెలుస్తోంది.

"""/"/ వైఎస్ జగన్( YS Jagan Memes ) మీద మార్ఫింగ్ పిక్స్, మీమ్స్, తప్పడు సర్వేలు ప్రచారం చేయడమే కాకుండా టీడీపీ తమకు అనుకూలంగా ఉండే వార్తలను సోషల్ మీడియా( Social Media )లో ప్రచారం చేస్తుందని సమాచారం.

ఈ క్రమంలోనే సుమారు 1.5 లక్షల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడంతో పాటు ఐదు వందల సోషల్ మీడియా ఫేజస్ ను కూడా నిర్వహిస్తుందంట.

ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు ఇన్ స్టా ఫ్లాట్ ఫామ్స్ పై నుంచి అసత్య ప్రచారాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

దాంతో పాటుగా సుమారు 2.5 లక్షల మందితో ‘ మన టీడీపీ’ Mana TDP ) పేరుతో టీడీపీ అప్లికేషన్స్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.

"""/"/ అయితే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారట.

రాష్ట్రంలో వైఎస్ జగన్ కు, వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకనే ఈ విధంగా ఫేక్ కంటెంట్లను ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి( TDP Alliance ) ఓటమి పాలవుతుందన్న భయంతోనే జగన్ పై, ఆయన పార్టీపై విమర్శలు చేయడమే కాకుండా సోషల్ మీడియాను వినియోగించుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని పలువురు ఆగ్రహిస్తున్నారు.

అయితే ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.తప్పుడు కథనాలను ప్రచారం చేసినా.

రాబోయేది జగన్ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నారట.ప్రాంతాలతో సంబంధం లేకుండా వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనమని పలువురు చెబుతుండటం విశేషం.

వింటర్ లో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను మీరు తినాల్సిందే!