పల్లెటూరుకు చెందిన ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా చదవండి.. చదివిన తర్వాత షేర్ చేయకుండా ఉండలేరు
TeluguStop.com
పెరుగుతున్న టెక్నాలజీ, మరియు పోటీని తట్టుకోవాలంటే ఊర్లల్లో చదవు సరిపోవడం లేదు.ఊర్లల్లో ఉండి ఉద్యోగం చేస్తే జీవితం సంతోషంగా ఉండదు.
దాంతో జనాలు పల్లెలను వదిలి పట్టణాల బాట పడుతున్నారు.ఇష్టం లేకున్నా కూడా ఊర్లో వ్యవసాయాలు సరిగా లేక, సరైన నీటి వసతి లేక పోవడంతో వ్యవసాయాలు వదిలేసి పట్టణం దారి పడుతున్నారు.
కొందరు పనుల కోసం పట్టణం వెళ్తే, మరి కొందరు చదువు, ఉద్యోగం కోసం అంటూ పట్టణాల దారులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఊర్లలో పరిస్థితి దారుణం అవుతోంది.ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రతి గ్రామం కూడా మెల్ల మెల్లగా ఖాళీ అవుతూ వస్తోంది.
1990లలో గ్రామల్లో పరిస్థితి, ఇప్పటి పరిస్థితి చూస్తుంటే కన్నీరు వస్తుంది.అప్పట్లో గ్రామాల్లో ఐఖ్యమత్యం, ఆనందం కనిపించేవి.
కాని ఇప్పుడు ఉన్న కొంత మంది కూడా రాజకీయాలు, మతాలు, కులాలు అంటూ విడిపోయారు.
పల్లెటూరు అంటే మతం ఏదైనా, కులం ఏదైనా వరుసలు పెట్టుకుని పిల్చుకునే వారు.
కాని ప్రస్తుతం మాత్రం పట్టణాల్లో మాదిరిగా ఎవరికి వారే అన్నట్లుగా తయారు అయ్యారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ పరిస్థితులన్నింటిని అద్బుతంగా వివరించి పాటగా మల్చి, మంచి విజువల్స్ తో యూట్యూబ్ లో బీవీఎం క్రియేషన్స్ వారు ఒక పాటను పోస్ట్ చేశారు.
ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డు గోడలు ఎవరు పెట్టిండు రా ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిల్చుకునేవారమురా ఒక చెట్టు నీడన వంద మంది అన్నట్లు ఉరంతా ఒక్కటై ఉన్నామురా.
అంటూ సాగే పాట పల్లె మూలాలు ఉన్న ప్రతి ఒక్కరి ఒల్లు పులకరింపజేస్తుంది.
అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో అద్బుతంగా వైరల్ అయిన ఈ పాట మీకోసం.
మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి నెమరవేసుకుని, స్నేహితులతో ఈ పాటను షేర్ చేయండి.
తన సినిమా పోస్టర్లను తనే అంటించుకున్న రాకేశ్.. కేసీఆర్ మూవీతో హిట్ సాధిస్తారా?