వైరల్: హెల్మెట్ లేకపోయినా చిన్న ట్రిక్‌తో ఫైన్ నుంచి తప్పించుకున్న కుర్రాడు!

హెల్మెట్( Helmet ) లేకుండా డ్రైవ్ చేయడం అనేది చట్ట విరుద్ధం.దీనికి ఫైన్ చెల్లించ తప్పదు.

ఎందుకంటే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ( Driving ) అనేది అంత సేఫ్ కాదు.

హెల్మెట్ లేని కారణంగా ప్రతిఏటా కొన్ని వందల మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి.

అయినా కూడా మనలో చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు.

ఇక రోడ్డుపైన హఠాత్తుగా పోలీసులు కనిపించినపుడు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతోంది.

"""/" / వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తుండడాన్ని గమనించవచ్చు.

ఇంతలో అతగాడికి రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీసులు కనిపించగా చాలా సింపుల్ ట్రిక్కు ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

విషయం ఏమంటే, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధమే కానీ, బైక్ తోసుకుంటూ వెళ్లడం చట్ట విరుద్ధం కాదు.

ఇదే ట్రిక్ ని వాడుకున్నాడు ఆ కుర్రాడు.ఆ కుర్రాడు పోలీసులను చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

"""/" / దీంతో పోలీసులు అతడిని పట్టించుకోలేదు.పోలీసులను దాటి పోగానే ఆ కుర్రాడు మరలా స్కూటీ స్టార్ట్ చేసుకుని వేగంగా ముందుకు వెళ్లిపోతుండడాన్ని గమనించవచ్చు.

ఈ ఘటన మొత్తాన్ని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 6.5 కోట్ల మంది చూడడం విశేషం.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించడం విశేషం."ఎన్ని చట్టాలు చేసినా భారతీయుల తెలివితేటల ముందు అవి జుజుబీ" అని కొంతమంది కామెంట్ చేస్తే, "ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టాము" అని మరికొందరు కామెంట్ చేసారు.

చిరంజీవి సినిమాతో కూడా అనిల్ రావిపూడి హిట్టు కొడతాడా..?