కోట్ల విలువ చేసే నగలు కాజేసి.. కేవలం రెండువేల కోసం అడ్డంగా బుక్కైన నిందితుడు..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం ఎటువంటి దారుణాల కైనా పాల్పడుతున్నారు.కొందరు కష్టపడి సంపాదించి పైకి రావాలని కృషి చేస్తూ ఉంటే, మరికొందరేమో ఎటువంటి కష్టం పడకుండానే డబ్బు సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందుకోసం అసాంఘిక కార్యకారపాలు, దొంగతనాలు, నమ్మించి మోసం చేయడం, ఇక ఆన్లైన్లో టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు కొట్టేయడం లాంటి మార్గాలను ఎంచుకొని ఎంతోమంది శ్రమ పడకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు.
కానీ చిన్న చిన్న తప్పుల వల్లనే అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలు అవుతున్నారు.
ఈ కోవకే చెందిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.హైదరాబాదులోని ఎస్.
ఆర్.నగర్ పరిధిలో ఫిబ్రవరి 17న శ్రీనివాస్ అనే వ్యక్తి 7 కోట్ల విలువచేసే వజ్రాలు దొంగతనం చేసి పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ఫిబ్రవరి 17న మాదాపూర్ లో ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారి, అనూష అనే కస్టమర్ కు 50 లక్షల విలువైన వజ్రాలు ఇచ్చేందుకు సేల్స్ మెన్ ఆక్షయ్ తో కలిసి మధురానగర్ కు కారులో వెళ్ళింది.
కారులో ఏడు కోట్ల విలువైన వజ్రాలు గమనించిన డ్రైవర్ శ్రీనివాస్ కారు తో సహా పారిపోయాడు.
"""/" /
రాధిక ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకొని కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీనివాస్ కారును కూకట్ పల్లిలోని మెట్రో మాల్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలం లో వదిలిపెట్టి అక్కడి నుండి జారుకున్నాడు.
నగల బ్యాగు తో పాటు రాధిక ఇంటికి వచ్చి అతని బైక్ తీసుకొని శ్రీశైలం వైపుగా వెళ్తూ నర్సంపేట లోని బంధువుల ఇంటికి వెళ్ళాడు.
ఇక పాత ఫోన్ పారేసి కొత్త ఫోన్ తీసుకుందామని, పెట్రోల్ ఖర్చులకోసం రాధిక ఇచ్చిన డెబిట్ కార్డ్ ఉపయోగించాడు.
"""/" /
డెబిట్ కార్డ్ ఐఎంఈ నెంబర్ ఆధారంగా పోలీసులు సొంతూరు కొవ్వూరులో శ్రీనివాస్ ను అరెస్టు చేశారు.
పాత ఫోన్ ఉంటే దొరికిపోతాననుకున్న శ్రీనివాస్ డెబిట్ కార్డ్ వాడితే దొరికిపోతానని తెలియక కేవలం 2000 రూపాయల మొబైల్ ఫోన్ కొనేందుకు డెబిట్ కార్డ్ ఉపయోగించి అడ్డంగా బుక్ అయిపోయాడు.
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?