వైరల్ వీడియో: పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో కాబోలు..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీ వీడియోస్( Funny Videos ) ఉంటే మరికొన్ని షాకింగ్ వీడియోస్ ఉండడం గమనిస్తుంటాం.

ఇందులో మరికొన్ని వీడియోలు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.

గాడిదకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ రోడ్డుపై వెళ్తున్న గాడిదను( Donkey ) వ్యక్తి ఎకసెక్కాలు చేయడంతో చివరికి అతని పరిస్థితి ఎలా తయారయిందో ఈ వీడియోలో చూడొచ్చు.

ఇక ఈ వీడియో ను పూర్తిగా చూస్తే. """/" / ఓ వ్యక్తి గాడిద తోక పట్టుకోని దానిని లాగడానికి ప్రయత్నిస్తుండగా గాడిద మాత్రం అతన్ని మొదటిగా దాని వెనుక కాలితో తన్నడానికి ప్రయత్నిస్తుంది.

కాకపోతే., అతడు దాని నుండి తప్పించుకుంటాడు.

అయినా కానీ అతడు అదేపనిగా గాడిద తోకతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తాడు.దీంతో గాడిదకు కోపం రావడంతో అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ధ్యేయంతో గాడిద అతడిని కొంత దూరం వరకు పరిగెత్తిస్తుంది.

ప్రస్తుతం ఈ సందర్భం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.

"""/" / ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ వరుస పెట్టి కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు వీడియోలో ఉన్న వ్యక్తిపై మండిపడుతుండగా మరికొందరైతే.ఇలాంటి ఎదవలకి ఇలాగే జరగాలంటూ అంటుండగా.

మరికొందరు పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు.

కాబట్టి జంతువులతో ప్రేమగా ఉండాలి కానీ.వాటిని ఇబ్బంది పెడితే ఈ విధంగానే పరిస్థితులు ఉంటాయి.

టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ?