కూతురు దూరమైన బాధలో ఆత్మహత్య చేసుకున్న ఆ కన్న తండ్రి….!

ఒక చిన్న తప్పు కి పచ్చని కాపురం చిన్నా భిన్నమైపోయింది.కేవలం ఒక మహిళ వివాహేతర సంబంధం తో అటు కన్న కూతురు ఇటు కట్టుకున్న భర్తను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

ఇటీవల మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు చెందిన అనూష అనే వివాహిత మహిళ భర్త కళ్యాణ్, ఐదేళ్ల కూతురు ఆద్య తో కలిసి కొద్దీ రోజులుగా పోచారంలో నివాసం ఉంటున్నారు.

కళ్యాణ్ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉండడం తో రోజూ ఆఫీస్ కు వెళ్ళిపోతాడు.

ఈ సమయంలో కళ్యాణ్ స్నేహితుడు అయిన కరుణాకరన్ అనే వ్యక్తి తో అనూష కు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భర్త విధులకు వెళ్లిన సమయంలో కరుణాకర్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండేది.

ఈ క్రమంలోనే మరో వ్యక్తి రాజశేఖర్ తో పరిచయం ఏర్పడింది.అతడితో కూడా సన్నిహితంగా ఉండడం తో కరుణాకర్ కు కోపం వచ్చి ఈ విషయంగా అనూష తో గొడవకు దిగాడు.

ఈ నేపథ్యంలో నిదానంగా కరుణాకర్ కు దూరంగా ఉండడం మొదలుపెట్టింది.ఆ తరువాత రాజశేఖర్ తో కూడా అక్రమ సంబంధం నెరపడం తో విషయం తెలుసుకున్న కరుణాకర్ పదిరోజుల క్రితం వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం అనూష ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో రాజశేఖర్ తో ఉన్న అనూష ఇంటి తలుపు కొట్టడం తో విషయం తెలుసుకున్న ఆమె రాజశేఖర్ ను ఇంటిలోని ఒక గదిలో దాచిపెట్టింది.

అనంతరం అనూష తో ఈ విషయంగా గొడవ పడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ఆద్య మెడపై కత్తిపెట్టి రాజశేఖర్ ను బయటకు రావాలని లేదంటే ఆద్య ను హతమారుస్తాను అంటూ బెదిరించాడు.

అయితే ఎంతసేపటికి రాజశేఖర్ బయటకు రాకపోవడం తో కరుణాకర్ ఆద్య ను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు.

చిన్నారి ఆద్య మృతి తో కుటుంబం కుదేలైంది.అయితే ఒకపక్క భార్య చేసిన తప్పుడు పని బయటపడి అవమానం గా ఫీలవుతున్న కళ్యాణ్ కు ఆద్య మరణం కూడా జీర్ణించుకోలేకపోయాడు.

దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన కళ్యాణ్ చివరికి ఈ రోజు భువనగిరి లో రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

ఆ ఇల్లాలు ప్రియుడి మోజులో పడి అటు సంసార జీవితాన్ని కోల్పోవడం తో పాటు కట్టుకున్న భర్త,పేగు తెంచుకున్న బిడ్డను సైతం కోల్పోయింది.

రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయిందనే విషయం మీకు తెలుసా..?