వాకింగ్‌కి వెళ్లిన ఒంటరి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన దొంగ.. వీడియో వైరల్..
TeluguStop.com
పట్టపగలే కాదు వేకువజామున కూడా దొంగలు( Thieves ) రెచ్చిపోతున్నారు.ఒంటరిగా కనిపించిన వారిపై దాడులు చేసి వారిని దోచుకుంటున్నారు.
ఇటీవల ఢిల్లీలోని ద్వారకలో( Dwaraka ) ఓ నిర్మానుష్య రహదారిపై మహిళ ఒంటరిగా వాకింగ్( Walking ) చేస్తుండగా ఆమెపై దాడికి పాల్పడ్డాడో దొంగ.
ఆ మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.వెనుక నుంచి వచ్చి సడన్‌గా మెడను పట్టుకుని గట్టిగా ఒత్తుతూ హత్యాయత్నం చేశాడు.
ఆమెను కింద పడేసి ఆపై ఆమె పర్సు, ఫోన్‌ను తీసేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
దాని తర్వాత ఆ మహిళ ఎలాగోలా లేచి అక్కడినుంచి పారిపోగలిగింది.అయితే ఘటన జరిగిన కొన్ని గంటలకే సదరు దొంగను పోలీసులు పట్టుకుని ఆమె పర్సు, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తను సోమవారం వార్తా సంస్థ PTI నుంచి నివేదించింది.మరో వార్తా సంస్థ ANI ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది.
"""/" /
ఢిల్లీలోని( Delhi ) ఉత్తమ్‌నగర్‌లో జనవరి 6న ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన చోటు చేసుకున్నాక బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం సమీపంలోని సీసీ కెమెరాలను ఉపయోగించింది.అలా టెక్నాలజీని ఉపయోగించి ఎట్టకేలకు ఆ వ్యక్తిని కనుగొని పట్టుకున్నారు.
అతని పేరు శివ కుమార్.( Shiva Kumar ) చాణక్యపురిలో నివాసముంటున్న అతని వయస్సు 38 సంవత్సరాలు.
"""/" /
కుమార్ మహిళను వెంబడించి, ఆపై ఆమెపై దాడి చేయడం వీడియోలో క్యాప్చర్ అయ్యింది.
అతడు గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు.అనంతరం ఆమె పర్సు, ఫోన్ తీసుకుని పారిపోయాడు.
పోలీసులు కుమార్‌ని మరిన్ని ప్రశ్నలు అడిగారు.ఇంతకు ముందు మరో ఆరు నేరాలు చేసినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని ద్వారక డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.
బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?