వీడియో: వావ్ వాట్ ఎ స్ట్రెంత్.. ఆరు బైకులను ఒకేసారి ఆపాడు..

చాలామంది తమ టాలెంట్ చూపించడానికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటారు.అయితే కొందరికి సోషల్ మీడియాతో తమకు పని లేకపోయినా వారి టాలెంట్ చూసి సోషల్ మీడియానే వారిని వైరల్ చేస్తుంటుంది.

అయితే తాజాగా కూడా ఒకరి టాలెంట్‌ను సోషల్ మీడియా అందరికీ చూపిస్తోంది.ఆ యువకుడి టాలెంట్ చూసి నెటిజనులందరూ ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.ఉత్తర్‌ప్రదేశ్ లోని బగ్‌ఫట్‌కు చెందిన ఒక యువకుడి చేతుల్లో చాలా స్టామినా ఉంది.

ఎంతగా అంటే అతడు ఒకేసారి ఆరు బైక్‌లను తన చేతులతో ఆపగలడు.ఆరు బైక్‌లను ఒకేసారి రేసింగ్ ఇచ్చినా ఒక్క ఇంచ్ కూడా కదలకుండా వాటిని పట్టుకోగలడు.

ఈ స్టంట్‌ను ఇటీవలే చాలా పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేశాడు.కాగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేయగానే మనకు ఓ యువకుడు తన రెండు చేతులకు పెద్ద తాళ్లు కట్టుకొని నిలబడి ఉండటం చూడవచ్చు.

అతను పట్టుకున్న తాళ్ళ చివరలను 6 బైక్‌లకు చాలా గట్టిగా జత చేశారు.

ఆ తర్వాత ఆరుగురు ఆ బైక్‌లపై కూర్చొని రైజింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. """/"/ ఆ సమయంలో ఈ యువకుడు ఏ బైక్ కూడా ముందుకు కదలకుండా చాలా బలంగా తన చేతులతో తాళ్లను పట్టుకున్నాడు.

అయితే అతడిని ఎలాగైనా ఓడించాలని బైకర్స్‌ ఎక్కువగా రైసింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు.అయినా కూడా బండ్ల నుంచి పొగలు వెల్లువెత్తాయి కానీ అవి ముందుకు కదల లేకపోయాయి.

ఇలాంటి స్టంట్ చేయడం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు.ఈ యువకుడు కూడా సామాన్యుడు కాదు.

ఇతడు ఒక బాడీ బిల్డర్.అతడి సాహసోపేతమైన వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

నిర్మాతగా మారుతున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. ప్రొడ్యూసర్ గా భారీ సక్సెస్ సాధిస్తారా?