న్యూయార్క్‌లో మూవింగ్ ట్రైన్‌పై నిలబడ్డ యువకుడు.. వైరల్ వీడియో..!
TeluguStop.com
ఈ రోజుల్లో యువకులు ట్రైన్స్‌పై స్టంట్స్( Train Stunts ) చేయడం బాగా ఎక్కువైంది.
కదులుతున్న రైలు బోగీ ఎంట్రన్స్ లో నిల్చని ప్రమాదకరమైన సాహసాలు( Dangerous Stunts ) చేస్తూ చాలామంది ఇప్పటికే మరణించారు.
కొందరు సెల్ఫీల పిచ్చితో వేగంగా వస్తున్న ట్రైన్ పక్కనే నిల్చుకొని దాన్ని ఢీకొని చనిపోయారు.
ఇంకొందరు ట్రైన్ రూఫ్‌పైకి ఎక్కి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ వైర్ల కారణంగా మాడి మసైపోయారు.
ఈ ఘటనలు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి.వీటి పట్ల అధికారులు చర్యలు చేపడుతున్నా కొందరు వారికి భయపడకుండా మూర్ఖంగా అలాంటి పనులు చేస్తూనే ఉన్నారు.
"""/" /
తాజాగా న్యూయార్క్‌లో( New York ) ఒక యువకుడు కదులుతున్న రైలు పైన నిలబడి అందర్నీ నివ్వెరపరిచాడు.
ఆ ట్రైన్ చాలా వేగంగా దూసుకెళ్తోంది.అయినా దానిపై అతడు నిలబడి ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లో ఉన్నవారికి షాక్ ఇచ్చాడు.
హూడీ ధరించిన ఈ వ్యక్తి ఒక్క క్షణం బ్యాలెన్స్ కోల్పోగా అతడు కింద పడతాడేమోనని చాలామంది భయపడిపోయారు, కానీ అదృష్టం కొద్దీ అతడు మళ్లీ లేచి నిలబడ్డాడు.
"""/" /
ఈ వీడియో వైరల్‌గా మారగా, పలువురు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు వ్యక్తులు అతని ప్రమాదకరమైన ప్రవర్తనను విమర్శించారు.ఇది తెలివితక్కువదని, అతను గాయపడవచ్చని వారు విమర్శించారు.
స్టేటెన్ ఐలాండ్‌లోని ఓ యువకుడు కొన్ని నెలల క్రితం అదే పని చేసి మరణించాడు.
కొన్ని క్షణాల థ్రిల్ కోసం బంగారం లాంటి జీవితాన్ని రిస్క్ లో పెట్టొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైలు లేదా ప్లాట్‌ఫామ్‌పై ప్రమాదకరమైన స్టంట్ చేయడం ఇది మొదటిసారి కాదు.బీహార్‌లోని రైల్వే స్టేషన్‌లో కార్ట్‌వీల్స్ చేస్తూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.
చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని చంపాలని సూప్‌లో విషం కలిపింది.. కట్ చేస్తే షాక్..?