ఇదేందయ్యా ఇది.. ఐటమ్ గర్ల్ వలె టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేసిన అంకుల్..
TeluguStop.com
సోషల్ మీడియాలో రోజూ షాకింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.నిజానికి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవ్వాలని కొందరు కావాలనే పబ్లిక్ లో పిచ్చి చేష్టలు చేస్తుంటారు.
వారి వింత, విచిత్రమైన ప్రవర్తనకు మామూలు ప్రజలు షాక్ అవుతుంటారు.మిగతావారు ఏమనుకున్నా సరే వీరు వైరల్‌గా మారి సోషల్ మీడియా స్టార్( Social Media Star ) అయిపోవాలని తెగ ఆరాటపడుతుంటారు.
సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా ప్రత్యక్షమయ్యాయి.రీసెంట్‌గా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
"""/" /
ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు నోరా ఫతేహి( Nora Fatehi ) వలె డ్రెస్ చేసుకొని ఒక అంకుల్( Uncle ) ఆమె లాగానే డ్యాన్స్ చేయడం కనిపించింది.
ఇదంతా చూస్తుంటే సదరు అంకుల్ నోరాని కాపీ కొట్టే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది.
ఆ వ్యక్తి ఒక కూడలిలో నిలబడి అందరికీ కనిపించేలా కిల్లర్ స్టైల్‌లో డ్యాన్స్( Dance ) చేయడం మనం గమనించవచ్చు.
అతడికి సమీపంలోనే వాహనాలు కూడా వెళ్తున్నాయి.కానీ అవేమీ పట్టించుకోకుండా ఇతడు అమ్మాయిలాగా టవల్ కట్టుకొని ట్రాఫిక్ పోలీసులు నిలబడే కూడలి ఎత్తులో నిల్చోని డ్యాన్స్ చేశాడు.
"""/" /
వీడియో ప్రకారం అతను కూడలి మధ్యలో నిలబడి టవల్( Towel ) ధరించే అమ్మాయిలాగా డాన్స్ చేయడం ప్రారంభించాడు.
అటుగా వెళుతున్న ప్రజలు అతనిని చూసి నవ్వుతూ కనిపించారు.అయితే కొంతమంది వీడియో కూడా రికార్డ్ చేయగా దానిని @dumbest_man1811 అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అనే క్యాప్షన్‌తో "ట్రాఫిక్ పోలీసుల డ్రెస్ కోడ్ అంటే ఏమిటి?" షేర్ చేసింది.
ఇది చూసి నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు.ఇదెక్కడి ట్రెండ్ అయ్యా బాబోయ్ మరి పనీపాట లేకుండా ఉన్నారా అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఇలా చేయండి!