వీడియో: వరద ఉధృతిలో మునిగిపోతున్న పిల్లలను కాపాడిన రియల్ హీరో..

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తిని రియల్ హీరో అని నెటిజన్లు పొగుడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఒమన్‌లో ఆకస్మిక వరదల చాలా మందిని ఇబ్బంది పెట్టేసాయి.

ఇదే సమయంలో ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు వరదల్లో చిక్కుకుపోయారు.కాగా వీరిని ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు.

ఆ వరద చాలా ఉధృతంగా వస్తున్నాం అతని భయపడలేదు.చాలా బలంగా అతడు ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకుంటూ ఇద్దరు పిల్లలను బయటికి తీసుకొచ్చాడు.

ఈ వీడియోని ప్రముఖ ట్విట్టర్ అకౌంట్ ఫిగెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఇప్పటివరకు 3.

8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఆ వీడియో చూసిన తరువాత చాలామంది ఆ వ్యక్తి ఆ ఇద్దరు పిల్లల తండ్రి అని అనుకున్నారు.

కానీ నిజానికి అతను ఆ పిల్లల్ని రక్షించడానికి వచ్చిన ఓ అపరిచితుడు.ఈ వీడియోలో పిల్లలను కాపాడుతున్న వ్యక్తి ఒక ఫొటోగ్రాఫర్ అని తెలిసింది.

అతని పేరు అలీ బీన్ నాసర్. """/"/ వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆ ఇద్దరు అబ్బాయిలను ఆ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించాడు.

అక్కడే ఒడ్డుపై నిలబడిన కొంతమంది వ్యక్తులు వరదలో అలీని ఒడ్డు పైకి లాగే ప్రయత్నం చేశారు.

ఇక వారు ముగ్గురు సురక్షితంగా వరద నుంచి బయటపడ్డారు.ఈ వీడియో చూసి సాహసం చేసిన వ్యక్తిని అందరూ ప్రశంసిస్తున్నారు.

'ఈ ధైర్యవంతునికి హ్యాట్సాఫ్ ' అని ఒక వ్యక్తి కామెంట్ చేసాడు.'సహాయానికి హద్దులు లేవు' అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.

ఇలా చాలా మంది ఆ వ్యక్తి గురించి చాలా కామెంట్స్ చేసారు.మరికొందరు అతన్ని రియల్ హీరో అని పొగిడారు.