మనిషిని మింగబోయిన డైనోసార్.. త్రుటిలో దక్కిన ప్రాణాలు

ఎన్నో వేల ఏళ్ల క్రితం భూమిపై అసంఖ్యాక జీవులు నివసించేవి.అయితే భూమిపై వచ్చిన మార్పులు, ప్రకృతి విపత్తుల కారణంగా చాలా జీవులు అంతమయ్యాయి.

అలాంటి వాటిలో డైనోసార్ కూడా ఒకటి.ఈ రాకాసి బల్లులపై తీసిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.

ఆ సినిమాలకు కోట్లాది రూపాయల కలెక్షన్లను అందించాయి.అయితే నిజ జీవితంలో మనకు అవి తారసపడవు.

ఎవరైనా పరిశోధకులు ఎన్నో చోట్ల తవ్వితే లభించిన వాటి శిలాజాల ఆధారంగా డైనోసార్ల గురించి మనకు చాలా విషయాలు తెలిశాయి.

అలాంటివి నిజంగా భూమి మీదకు వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.మనిషిని కరకరా నమిలేస్తాయి.

అయితే ఇటీవల ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.రోడ్డుపైకి వచ్చిన ఓ డైనోసార్ తనకు ఆహారం పెట్టబోయిన వ్యక్తిని అమాంతంగా మింగబోయింది.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ప్రస్తుతం మనకు నెట్టింట పలు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి.

వాటిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం.వాటిలో నిజం ఎంతున్నా, కావాలని క్రియేట్ చూసినా చాలా వీడియోలు మాత్రం వినోదం పంచుతాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.ఇన్‌స్టాగ్రామ్‌లోని డైనోసార్ యూఎస్‌ఏ ఫ్యాన్ క్లబ్ అనే ఖాతా నుంచి ఓ వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు.

"""/" / అందులో ఓ డైనోసార్ నడుచుకుంటు వస్తుంది.దానికి ఓ వ్యక్తి ఆహారం అందించబోతాడు.

అయితే అమాంతంగా అతడిని ఆ డైనోసార్ మింగేయాలని ప్రయత్నిస్తుంది.సమయస్పూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తి పక్కకు దూకేస్తాడు.

అలా దూకేసి ప్రాణాలు దక్కించుకుంటాడు.అయితే ఇది అంతా ఫేక్ అని, డైనోసార్ వేషం వేసుకున్న వ్యక్తితో అలా చేయించారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చూడడానికి మాత్రం అచ్చం డైనోసార్ లాగానే అది కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు.

వీడియో: ఇదెక్కడి వింత బిర్యానీ.. అవతార్ కలర్‌లా ఉందే..?