లిఫ్ట్‌లో లోపం.. రెప్పపాటు సమయంలో బతికిపోయిన యువకుడు.. వీడియో వైరల్..

భవనాలలో అంతస్తుల పైకి చేరుకునేందుకు మెట్లు ఎక్కడం చాలా శ్రమతో కూడుకున్నది.ఆరోగ్యంగా ఉన్నవారు ఈ మెట్లను వెంటనే ఎక్కగలుగుతారు కానీ వృద్ధులకు, పేషెంట్స్‌కి మాత్రం ఇది కష్టం అని చెప్పవచ్చు.

అందుకే లిఫ్టులు, ఎలివేటర్స్‌ తీసుకొచ్చారు.అయితే వీటివల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది.

కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ఒక మహిళ లిఫ్ట్‌లో లోపం కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవల మరొక చోట కూడా ఒక నర్స్ పేషెంట్ లిఫ్ట్ లో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు లిఫ్టు ఒక్కసారిగా కిందకి వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.ఈ ఘటనలో ఆ పేషెంట్ బతికిపోయాడు.

ఈ కోవకు చెందిన మరొక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో కూడా ఒక లిఫ్ట్ హఠాత్తుగా కిందికి వెళ్లిపోవడంతో ఒక యువకుడి ప్రాణానికి పెద్ద ప్రమాదం జరగబోయింది.

అయితే అతడు రెప్పపాటు సమయంలో అప్రమత్తమై ఈ పెను ప్రమాదం నుంచి బయట పడ్డాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొదటగా టిక్‌టాక్‌లో ఈ వీడియో ప్రత్యక్షమైంది.

ఆ తర్వాత ట్విట్టర్‌లో ఇది చక్కర్లు కొడుతోంది.వైరల్ వీడియోలో.

ఒక లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే అందులోకి ఒక యువకుడు పోవడం చూడవచ్చు. """/"/ అంతకు ముందు ఇందులో మరొక యువకుడు ఉన్నాడు.

ఆ యువకుడు ఫోన్ చేస్తూ ఉన్నాడు.లిఫ్ట్ ఆగగానే అతడు బయటకు వచ్చేందుకు ముందడుగు వేశాడు.

అంతలోనే అతని కాలుకి ఫ్లోర్ గుద్దుకుంది.దాంతో ఒక్కసారిగా అతడు ఉలిక్కి పడ్డాడు.

అనంతరం పైన లిఫ్ట్ పైభాగం తన మెడ మీదకి వస్తుందని గుర్తించాడు.ఇదంతా కూడా మిల్లీ సెకనులో జరిగిపోయింది.

అయితే అతడు చాకచక్యంగా తన తలను లిఫ్ట్ లోపలికి తీసుకెళ్లాడు.దాంతో పెనుప్రమాదం తప్పింది.

ఈ వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?