పామును ముద్దాడిన యువకుడు ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్ అవుతారు...

చనువు ఇచ్చింది కదా అని పులితో పరాచకాలు ఆడకూడదు, అని సినిమాలో హీరో డైలాగ్ చెప్తాడు.

ఇది కేవలం పులికే కాదు ఏ అడవి జంతువుకైనా వర్తించే డైలాగ్ అనే చెప్పాలి.

ఏదో చనువిచ్చాయి కదా, మనల్ని పట్టుకోనిస్తున్నాయి కదా అని ప్రమాదకర పెంపుడు జంతువులతో అయినా జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఈ విషయం తెలియని ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పాములు ఎక్కువగా మనుషులు ఉండే ప్రదేశాలలో కూడా వస్తూ ఉంటాయి.

ఇళ్ల మధ్యలోకి వచ్చిన తాచుపామును పట్టుకున్న ఒక యువకుడు దాన్ని పొదల్లోనో వదిలేయకుండా ఆటలాడాలని చూసాడు.

పాము తలపై ముద్దుపెట్టుకోబోయాడు.దాంతో అది భయంతో వెనక్కు తిరిగి అతని పెదాలపై కాటు వేసింది.

ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగు చూసింది.ఆ వ్యక్తి ఎవరనే విషయం తెలియనప్పటికీ, ప్రస్తుతం బాగానే ఉన్నాడని, పాము కాటు వల్ల అతని ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదని సమాచారం తెలిసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోనీ వ్యక్తి పాము పడగపై వెనుక నుంచి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

"""/"/ఈ సమయంలో చటుక్కున వెనక్కు తిరిగిన పాము అతని పెదాలపై కాటేసింది.

దీంతో అతను భయంతో పామును వదిలేయగా పక్కనున్న మరో యువకుడు దాన్ని బంధించేందుకు ప్రయత్నించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆ యువకుడికి ఏమైందని ఆందోళన చెందుతూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో ఆ పాము కూడా అతనికి ముద్దు పెట్టింది సారీ,ఆ పాముకు ఆల్‌రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడట అంటూ జోక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా జంతువులు చనువిచ్చాయి కదా అని వాటితో ఆడుకుంటే ఇలాంటి గుణపాఠలే చెబుతాయని మరికొందరు చెబుతున్నారు.

వీడియో వైరల్: ఫోన్ రిపేర్ షాప్ లోకి వచ్చిన అనుకోని అతిధి.. సీన్ కట్ చేస్తే..