ప్రియుడిని ప్రేమించి మోసం చేసిన యువతి... కోపంతో ప్రియుడు ఏం చేశాడంటే?

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో యువతీ యువకులు కొన్ని నెలల వరకూ బాగానే ఉంటూ ఆ తరువాత చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.

చాలామంది ప్రేమను ట్రైమ్ పాస్ వ్యవహారంలానే చూస్తున్నారు.కొందరు ప్రేమలో మోసపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం అవతలి వ్యక్తుల జీవితాలను నాశనం చేస్తున్నారు.

తాజాగా యూపీలో ప్రేమించిన యువతి మోసం చేసిందని ఆమె మాజీ ప్రియుడు యువతిపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

పూర్తి వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్ లో సరోజ్ కుమార్ అనే 28 సంవత్సరాల యువకుడు ఒక యువతితో ప్రేమలో పడ్డాడు.

ఆ యువతి కూడా సరోజ్ ను ప్రేమించింది.కొంతకాలం తరువాత మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.

ఆ తరువాత యువతికి ఒక లాయర్ తో పెళ్లి కుదిరింది.ఈ విషయం తెలిసిన మాజీ ప్రియుడు ఊరంతా మార్ఫింగ్ చేసిన యువతి ఫోటోలతో హ్యాపీ హోలీ అని రాసి పోస్టర్లు అంటించాడు.

తన కూతురు పోస్టర్లు గోడపై అంటించారని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు సరోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా యువతి తనను మోసం చేసిందని అందుకే పోస్టర్లు వేసి ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పాడు.

ఆమెపై పగతోనే ఫోటోలు మార్ఫింగ్ చేసినట్లు చెప్పాడు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.