వైరల్ వీడియో: అలా చేయాలని ఎలా ఇదే వచ్చింది బ్రో.. బైక్ తో రైలును లాగుతున్నావ్..

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన గాని స్మార్ట్ ఫోన్ లు కనపడుతున్నాయి.భారతదేశం లాంటి దేశాల్లో కాస్త చౌకైన నెట్వర్క్ లు ఉండడంతో సోషల్ మీడియా వాడకం మరింతగా పెరిగింది.

ప్రస్తుత సోషల్ మీడియా రీల్స్ కాలంలో వైరల్ కావడానికి జనాలు ఏమైనా చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇందులో భాగంగానే చాలా మంది రకరకాల స్టెంట్స్ చేస్తుంటారు.తాజాగా ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌తో( Motor Cycle ) రైలు ఇంజిన్‌ను( Rail Engine ) లాగేందుకు ప్రయత్నించాడు.

ఇప్పుడు అతని ఈ వింత చర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని చూసిన ఇంటర్నెట్ ప్రజలు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకంటే ఇలా చేయడం వల్ల రైల్వే ఆస్తులకు నష్టం జరగడమే కాకుండా తీవ్ర ప్రమాదానికి కూడా దారి తీస్తుంది.

"""/" / ఈ వీడియోను @trainwalebhaiya అనే X హ్యాండిల్ సెప్టెంబర్ 12న పోస్ట్ చేయబడింది.

వ్యక్తి తన బైక్‌ను ఇంజిన్‌కు మందపాటి తాడుతో కట్టి లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

దాదాపు 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కొంత సమయం తర్వాత బైక్ ఎలా నిటారుగా నిలుస్తుందో చూడొచ్చు.

అయినా కానీ.రైలు ఇంజిన్ కాస్త కూడా కదలదు.

ఈ వీడియోకి ఇప్పటి వరకు 10 వేలకు పైగా వీక్షణలు, వందల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.

"""/" / ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇటువంటి వారిపై ఆర్పీఎఫ్( RPF ) సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్ చేస్తుండగా.

అతనికి పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

వెంటపడ్డ కుక్కలు.. రాయితో తరిమిన వ్యక్తి.. అది చూసి చితకబాదిన యజమానులు..?