వైరల్: వామ్మో! సిగరెట్ ఇలా కూడా వెలిగిస్తారా? మాకు తెలియదే!
TeluguStop.com
సోషల్ మీడియాలో అపుడపుడు వైరల్ అవుతున్న వీడియోలను( Viral Video ) చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ వాడకం విరివిగా పెరగడంతో కళాకారులకు లోటు లేకుండా పోయింది.ఈ క్రమంలోనే ఇపుడు గల్లీకొక సెలిబ్రిటీ అవతరిస్తున్నాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు! ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా చాలా మంది రోజూ చేసే పనులనే మిగతావారితో పోలిస్తే, భిన్నంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు.
మరికొందరు అయితే సినిమా నటులను ఇమిటేట్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు.మరి కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.
ఇలాంటి విచిత్రమైన వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
"""/" /
ఈ క్రమంలోనే తాజాగా, ఒక వీడియో నెట్టింట చాలా హాట్ టాపిక్ గా మారింది.
అవును, ఓ యువకుడు సిగరెట్( Cigarette ) వెలిగించే విధానం చూసి నెటిజన్లు నోళ్లెళ్లబెడుతున్నారు మరి! ఈ నేపథ్యంలో ‘‘సిగరెట్‌ను ఇలాక్కూడా వెలిగించవచ్చని ఇప్పుడే తెలిసింది’’.
అంటూ కామెంట్లు చేస్తున్నారు.విషయం ఏమిటంటే, ఓ కార్యక్రమంలో చాలా మంది యువకులు.
డీజే స్కీకర్లు( DJ Speakers ) రంగు రంగుల లైట్ల మధ్య సరదాగా డాన్సులు వేస్తున్నారు.
ఆ సందర్భంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకోవాలనుకోగా.సమయానికి అగ్గిపెట్టె దొరకలేదు.
ఈ క్రమంలో అతను అక్కడే ఉన్న రంగు రంగుల లైట్లను చూడగానే.తన బుర్రలో బల్బ్ వెలిగింది.
"""/" /
అనుకున్నదే తడవుగా వెంటనే డీజీ స్పీకర్లు ఏర్పాటు చేసిన స్టాండ్ పైకి ఎక్కి లైటు దగ్గరికి వెళ్లి సిగరెట్‌ను దానికి తగిలించాడు.
దాంతో ఆ వేడికి సిగరెట్ కాలింది.దాంతో సదరు వ్యక్తి గుప్పు గుప్పుమంటూ పొగను బయటికి వదిలాడు.
ఇతడి విచిత్ర నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘‘సిగరెట్‌ను ఇలాక్కూడా వెలిగించవచ్చని ఇప్పుడే తెలిసింది’’.
అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇవి దారుణమైన ఐడియాలు.అయినా డీజే లైట్స్ ( DJ Lights ) ఇంత ప్రమాదకరమా? అని ఇప్పుడే తెలిసింది అని కామెంట్స్ చేస్తున్నారు.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE