ఫన్నీ వీడియో: ట్రైన్ ముందుకెళ్లి నిలుచున్న ప్యాసింజర్.. దూల తీరింది..!

సెల్ఫీలు( Selfies ), ఫొటోల పిచ్చి ప్రజలలో ఎంతగా పెరిగిపోయిందంటే వారు వాటి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.

ప్రమాదకరమైన పర్వతాన్ని ఎక్కి సెల్ఫీ తీసుకోవడం, ఇంకా ఇతర ప్రమాదకరమైన పరిస్థితులలో నిల్చోని ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల్ఫీలు, షార్ట్ వీడియోలు రికార్డ్ చేయడం ఈరోజుల్లో కామన్ అయ్యింది.

కొంచెం తేడా వచ్చినా వీరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.నిజానికి ఇలాంటి సోషల్ మీడియా వ్యామోహం( Social Media Addiction )లో పడి చనిపోయిన వారెందరో ఉన్నారు.

"""/"/ ప్రతిరోజూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఈ చర్యల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఇప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవడం లేదు.

తాజాగా ఇలాంటి మరొక వ్యక్తి వెలుగులోకి వచ్చాడు.అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూసి మరీ ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ చాలామంది నెటిజన్లు ( Netizens )అతడిని తిట్టిపోస్తున్నారు.

వైరల్ వీడియోలో పట్టాలపై రైలు( Train ) వస్తుండడం, దాని రాక కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉండడం చూడవచ్చు.

రైలు పట్టాల మీదకు వెళ్లి నిల్చున్న వాళ్ల మనసులో ఏముందో తెలియదు కానీ ఎవరో సెల్ఫీ తీసుకుంటుండగా, ఎవరో వీడియో తీస్తున్నారు.

వీడియోలో చూస్తున్నట్లుగా, రైలు పట్టాలకు కొందరు చాలా దగ్గరగా నిల్చున్నారు, ట్రైన్ సమీపిస్తున్నా ట్రాక్పై నిలబడి సెల్ఫీలు( Selfie On Railway Track ) అలానే తీసుకుంటున్నారు.

రైలు చాలా దగ్గరగా వచ్చినప్పుడు, చాలా మంది ప్రజలు ట్రాక్ల నుండి దూరంగా వెళతారు, కానీ ఒక వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు.

అతను ట్రాక్ నుంచి చాలా దూరంగా నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది.కానీ ఆ వ్యక్తికి, ట్రాక్ కి మధ్య అడుగు దూరం కూడా లేదు.

అందుకే ఆ ట్రాక్ పై వస్తున్న రైలు అతడిని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎంత పెద్ద గాయమైందో తెలియరాలేదు.

వీడియోలో ట్రైన్ స్టాప్ అవుతూ కనిపిస్తుంది.దాన్నిబట్టి అతడు గాయపడ్డా ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

ఈ వీడియో( Viral Video ) చూసిన నెటిజన్లు అతడిని ఉద్దేశించి దూల తీరిందని కామెంట్స్ చేస్తున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience