వైరల్ వీడియో: మెట్రోలో ” నాటు.. నాటు.. ” రెచ్చిపోయిన యువకుడు..

నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లలో రకరకాల విన్యాసాలు, డాన్సులు వంటివి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

మరికొందరు డాన్స్ లు( Dance ) మెట్రోలో చేసి ఫేమస్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం మెట్రోలో ఒక వ్యక్తి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఢిల్లీలోని ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్‌లో( Indraprastha Metro Station ) RRR సినిమాలోని నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) డాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ డాన్స్ చేసే క్రమంలో మెట్రో లోపలికి వెళ్తూ, బయటికి వెళ్తూ అతను చేసిన డాన్స్ తీరు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది.

"""/" / ఇక ఈ వీడియోను ఒక క్రియేటర్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా మెట్రో రైలులో( Metro Train ) ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా డాన్స్ చేస్తూ మెట్రో నుండి బయటకు వెళ్లి మళ్లీ తనదైన స్టైల్ లో మెట్రో లోకి వచ్చి RRR లోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ హర్షం వ్యక్తం చేశారు.ఇక ఈ వైరల్ అవుతున్న వీడియోను చూసిన ఒక యూజర్ "నేను చాలా సంవత్సరాలగా మెట్రోలో ప్రయాణిస్తున్నాను కానీ.

ఇలాంటి వినోదాన్ని ఎప్పుడూ చూడలేదు" అంటూ కామెంట్ రూపంలో తెలిపాడు.ఇక మరో నెటిజన్ అయితే "ఇంట్రోవర్ట్స్ కలలో ఇదే విధంగా డాన్స్ చేశారు బ్రో" అంటూ కామెంట్స్ చేశాడు.

"""/" / ఇకపోతే నిజానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( DMRC ) వారు చెప్పిన దాని ప్రకారం.

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వీడియోలు చేయవద్దని పదే పదే అభ్యర్థిస్తున్న.

కొంతమంది వారి మాటను వినకుండా ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉన్నారు.ఇక వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సాంగ్ డాన్స్ వీడియో పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( DMRC ) వారు స్పందిస్తూ " డ్యాన్స్ సరదాగా ఉంటుంది.

కానీ., ఢిల్లీ మెట్రో మే నా - నాచో.

నాచో.నాచో.

" అంటూ ఓ స్పెషల్ పోస్ట్ ను రిలీజ్ చేసింది.ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!