వీడి పిచ్చి తగిలెయ్య కరోనా అబద్దమని చెప్పేందుకు ఎంత పని చేశాడు.. !

వెర్రి వేయి విధాలన్నట్లు ఒక్కోమనిషి ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది.ఎందుకంటే కళ్ల ముందు జరుగుతున్న దాన్ని అబద్ధం అని వాదిస్తుంటే అలాంటి వాన్ని చూస్తే వీడి మైండ్ దొబ్బిందా అనిపిస్తుంది.

ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో అందరికి తెలిసిందే.అలాంటిది కరోనా లేదు అన్న వాన్ని ఏమనాలో అర్ధం కాదు.

ఇకపోతే తాజాగా ఒక వ్యక్తి కరోనా వైరస్ ప్రమాదకరం కాదని నిరూపించేందుకు వింతగా ప్రవర్తించాడట.

ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం రెపుతుంది.ముఖానికి గుడ్డ కట్టుకొన్న ఒక వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వెళ్లి, ఏటీఎం మిషిన్‌లోని కీబోర్డు కీని నాకుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట.

ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సౌత్ యార్క్‌షైర్‌ పోలీసులు తెలిపారు.

గత వారం కూడా గ్లౌసెస్టర్ షైర్‌లో ఒక మహిళ కరోనా వైరస్ అబద్ధం అని ఒక ఆసుపత్రిలో ప్రచారం చేస్తుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.

ఇలా వీరి వింత ప్రవర్తన వల్ల కరోనావ్యాప్తి ఎక్కువ అవడం మాత్రం ఖాయం.

ఇలాంటి వారు తరచుగా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటున్నారు.మరి వీరిది పిచ్చి అనాలో, వెర్రి అనాలో అర్ధం కాని పరిస్దితి.

ఇదెక్కడి డబ్బు పిచ్చి.. కోట్లు ఉన్నా భార్య దగ్గరే అద్దె వసూల్‌..?