మూఢ నమ్మకాల పేరుతో దారుణం.. !
TeluguStop.com
లోకంలో టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది కానీ మనషుల ఆలోచనలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మూఢ నమ్మకాలనే రుగ్మతలు వీటికి అడ్దుగా ఉంటున్నాయి.
ఇలాంటి వాటి వల్ల మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుందే తప్ప మానవత్వం కనిపించదు.
ప్రస్తుతం ఈ మూడనమ్మాకాల వల్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహం అవగా, అప్పటినుండి పుట్టిన పిల్లలు దక్కడం లేదట.
దీనికి కారణం తన బాబాయి వేల్పుల రత్తయ్య (55) చేస్తున్న చేతబడే అని భావించాడట సత్యనారాయణ.
ఆ అనుమానం పెనుభూతం అవగా సత్యనారాయణ తన అన్నతో కలిసి రత్తయ్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు.
తర్వాత మృతదేహాన్ని మరో ముగ్గురు సాయంతో గోదావరి నదిలో పాతిపెట్టి ఎవరి దారిన వారు వెళ్లిపోయారట.
ఇక మృతుని కుమారుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గేమ్ ఛేంజర్ ‘దోప్’ సాంగ్ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్