పల్నాడు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్య..!
TeluguStop.com
ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన పల్నాడు జిల్లా( Palnadu District ) గురజాల మండలం కొత్త అంబాపురంలో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
అంబాపురంలో పత్తి రామారావు (71)( Patti Ramarao ) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ఇతనికి భార్య సరోజినీ దేవి, కుమారులు కృష్ణ, మోహన్, నరేష్ ఉన్నారు.రామారావు ఆరోగ్య శాఖలో ఉద్యోగ విరమణ చేశారు.
మోహన్, నరేష్ లు అమెరికాలో స్థిరపడ్డారు.కృష్ణ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
"""/" /
అయితే ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన నరేష్ ను తిరిగి అమెరికా( America ) పంపేందుకు రామారావు తన భార్య సరోజినీ దేవితో( Sarojini Devi ) కలిసి శుక్రవారం ఉదయం హైదరాబాదుకు వెళ్లారు.
ఆ తర్వాత భార్యను తన పెద్ద కుమారుడు కృష్ణ వద్ద దింపి రాత్రి 12 గంటలకు రామారావు తన స్వగ్రామానికి వచ్చాడు.
శనివారం సాయంత్రం సుమారుగా 4:30 గంటల సమయంలో ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి శారద వెళ్లి చూసేసరికి కుర్చీలో రామారావు విగతజీవిలా పడి ఉన్నాడు.
వెంటనే శారద పోలీసులకు సమాచారం అందించింది.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెల్లవారుజామున హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
"""/" /
రామారావు ఉద్యోగ విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీ( TDP ) కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు.
ఎప్పుడు గ్రామ తెదేపా నాయకులతో సన్నిహితంగానే ఉండేవాడు.ఎన్నికల సమయంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి, పార్టీ ప్రచారాలలో పాల్గొనేవాడు.
రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ హత్య ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
యూకేలో భారతీయ టెక్కీకి 15 రోజుల క్రిస్మస్ సెలవులు.. ఇండియాలో ఇంటర్నెట్ షేక్