వానరానికి చిప్స్ అందించబోయాడు.. అదుపుతప్పి వంద అడుగుల లోయలో పడిపోయాడు.. పాపం!
TeluguStop.com
మహారాష్ట్ర మహాబలేశ్వర్ - ప్రతాప్ గఝ్ ఘాట్ రోడ్డుపై ఓ ప్రమాదం జరిగింది.
మధ్య ప్రదేశ్ కు చెందిన ఓంకార్ నేహ్తే అనే వ్యక్తి.వానరానికి చిప్స్ అందించబోయాడు.
కానీ ప్రమాద వశాత్తు అదుపుతప్పి వంద అడుగుల లోతు లోయలో పడిపోయారు.అయితే ఈయన కుటుంబ సభ్యులతో కలిసి హరిహరేశ్వర్ నుంచి మహా బలేశ్వర్ కు వెళ్తున్నాడు.
అంబెన్లీ ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వీరు.జనని మాత మందిరం సమీపంలో కోతులను చూశారు.
వాటికి తినేందుకు ఏదైనా పెట్టాలనుకొని వాహనాన్ని ఆపుకొని మరీ కిందకు దిగారు.ఆ క్రమంలోనే సందీప్.
కోతులకు చిప్స్ అందించబోయాడు.కానీ పాపం.
అదుపు తప్పి వంద అడుగుల లోతు లోయలో పడిపోయాడు.విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు ప్రారంభించారు.
అయితే విపరీతమైన పొగమంచు కురుస్తున్నా.వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగించారు.
మూడు గంటల పాటు శ్రమించి సందీప్ ను బయటకు తీశారు.తీవ్ర గాయాల పాలైన సందీప్ ను వెంటనే మహాబలేశ్వర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు.
ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం సతారా జిల్లా ఆస్పత్రికి పంపించారు.ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు.అంత అవసరమా.
అజాగ్రత్తగా అలా వెళ్లడమేనా అంటా కామెంట్లు చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?