బర్త్‌డే పార్టీ కోసం హోటల్‌లో కుక్కతో పరాచకాలు.. చివరకు?
TeluguStop.com
ప్రస్తుత రోజులలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటు రావడం, లేదా అనుకోని విధంగా యాక్సిడెంట్లు జరగడం లాంటివి జరిగి ప్రాణాలు కోల్పోవడం చాలానే మీడియా ద్వారా రోజు తెలుసుకుంటున్నాము.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో తాజాగా చోటు చేసుకుంది.అప్పటి వరకు స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న ఓ యువకుడు, పార్టీ మధ్యలో బయటకు వచ్చి కుక్కతో పరాచకాలు ఆడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే. """/" /
హైదరాబాద్ చంద్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీవీ ప్రైడ్ హోటల్ లో స్నేహితుల బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఉదయ్ అనే యువకుడు.
పార్టీ మధ్యలో నుంచి బయటకు వచ్చి కుక్కతో కాసేపు సరదాగా ఆడుకున్నాడు.అనంతరం కుక్కతో పాటు పరుగులు పెడుతూ దానిని ఆడించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో కిటికి వైపు వెళ్లి.అనుకోకుండా కిటికీలో నుంచి కింద పడి ప్రాణాలను కోల్పోయాడు.
వీవీ ప్రైడ్ హోటల్లోని మూడవ అంతస్తు నుంచి కింద పడడంతో ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హోటల్ వద్దకు చేరుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారిస్తున్నారు. """/" /
ఇకపోతే, చనిపోయిన ఉదయ్ పాలిటెక్నిక్ స్టూడెంట్ గా పోలీసులు గుర్తించారు.
సోమవారం ఘటన జరిగినప్పటికీ.ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే, ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్ లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇదివరకు కూడా డెలివరీ కోసం వెళ్లిన జొమాటో బాయ్ కూడా కుక్క వెంటపడటంతో మూడవ అంతస్తు పైనుంచి కింద పడి మృతి చెందిన విషయం తెలియ చేసారు.
ఈ ఘటనతో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతోంది.
అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?