వైద్యం వద్దంటూ రోడ్డుపై పరుగులు.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
TeluguStop.com
ఎవరైనా అనారోగ్యం పాలైతే వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టి మరి ఎన్ని డబ్బులు అయినా లెక్క చేయకుండా వైద్యం అందించుకుంటాం.
కానీ ఒక వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు.అంబులెన్స్ వచ్చి మరి అతడికి వైద్యం అందించాలని చూస్తుంటే అతడు మాత్రం వైద్యం వద్దంటూ వారికీ చిక్కకుండా పరి పోవాలని రోడ్డు మీద ఉరుకులు పరుగులు పెట్టాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇప్పటికే 80 లక్షల మంది ఈ వీడియోను చూసారు.
ఈ వీడియో చుస్తే మీరు నవ్వును ఆపుకోలేరు.అంత ఫన్నీగా ఉంది ఈ వీడియో.
ఈ ఘటన అమెరికాలో జరిగింది.అతడికి హెల్త్ పరంగా ఏమయ్యిందో తెలియదు కానీ అతడిని ఆంబులెన్స్ లో ఎక్కించాలని చూస్తున్న వైద్య సిబ్బందిని మాత్రం ఒక రేంజ్ లో ఆదుకున్నాడు.
"""/"/
ఆంబులెన్స్ లో ఎక్కకుండా వారికీ చిక్కకుండా పరుగు అందుకున్నాడు.అంబులెన్స్ సిబ్బంది స్ట్రెచర్ మీద తీసుకెళ్తు ఉండగా అతడు కిందకు దూకి వారి నుండి తప్పించుకుని పరుగు అందుకున్నాడు.
రోడ్డు మీద పరుగులు తీస్తూ అడ్డు వచ్చిన వారిని గుద్దుకుంటూ వారు పడిపోయిన ఏం పట్టనట్టు ఒక బార్ వైపుగా పారిపోయాడు.
ఈ వీడియోను ఒక టిక్ టాక్ యూజర్ షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అవుతూ నెట్టింట నవ్వులు పూయిస్తుంది.
ఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే అతడు ఆంబులెన్స్ బిల్ ఎగ్గొట్టేందుకే ఇలా పారిపోయి ఉంటాడని అందరు భావిస్తున్నారు.
అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో అతడికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటో వివరాలు పూర్తిగా తెలియదు కానీ నెటిజెన్స్ ను మాత్రం ఆకట్టుకుంది.
మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.
షాకింగ్ వీడియో.. డ్రైవర్ పొరపాటుతో మొదటి అంతస్తు నుంచి కిందపడిన కారు