Advanced Virtual Reality Headset Vision Pro : వీడియో: వీఆర్ హెడ్‌సెట్ పెట్టుకొని డిన్నర్ ఎంజాయ్ చేసిన వ్యక్తి.. నెటిజన్లు షాక్..

యాపిల్ సంస్థ( Apple ) కొన్ని నెలల క్రితం లాంచ్ చేసిన అడ్వాన్స్‌డ్‌ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రో ప్రజల్లో సూపర్ హిట్ అయింది.

దీన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు కూడా ప్రజలు ప్రతిచోటా ఈ హెడ్‌సెట్లను ధరించడం ఇప్పుడు కామన్ అయిపోయింది.

ఈ ట్రెండ్ ఎలా నడుస్తుందో సోషల్ మీడియాలో గమనించవచ్చు, ఇక్కడ చాలామంది వీటిని తొడుక్కొని తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు.

అలాగే వీటిని ధరించి పబ్లిక్‌లో కనిపిస్తున్న వారి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి.

"""/"/ ఇండియన్ టెక్ హబ్ అయిన బెంగళూరులో విజన్ ప్రో( Advanced Virtual Reality Headset Vision Pro ) కొనుగోలు చేసిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఈ నగరవాసులు వీటిని పబ్లిక్‌లో వాడేస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు.ఆన్‌లైన్‌లో షేర్ చేసిన రీసెంట్ వీడియో ఒక కేఫ్‌లో ఒక వ్యక్తి తన VR హెడ్‌సెట్‌ ధరించి డిన్నర్ చేస్తున్నట్లు కనిపించింది.

సాధారణంగా తినడానికి వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరికి కంపెనీగా తీసుకెళ్తాం.కానీ ఇతడు VR హెడ్‌సెట్‌ ను మాత్రమే తీసుకెళ్లి దానినే తన తోడుగా భావించాడు.

అతను నిజంగా లేని పానీయాన్ని సిప్ చేస్తూ వర్చువల్ భోజనం చేస్తున్నట్లుగా కనిపిస్తాడు.

అతని చేతులతో గాల్లో ఏదో నొక్కుతున్నట్టు కనిపిస్తాడు.వర్చువల్ వాతావరణంతో ఇంట్రాక్ట్ కావడానికి అతను ఇలా చేస్తూ ఉండొచ్చు.

బహుశా గేమ్ ఆడవచ్చు లేదా డిజిటల్ స్పేస్ అన్వేషించవచ్చు. """/"/ విజన్ ప్రో పట్ల బెంగళూరు వాసులు( Bangalore ) ఇష్టాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు.

కొన్ని వారాల క్రితం, మరొక వీడియో కూడా వైరల్ అయ్యింది.అందులో వరుణ్ మయ్య అనే వ్యక్తి హెడ్‌సెట్ ధరించి బెంగళూరులోని ఇందిరానగర్‌లోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు.

ఏది ఏమైనా యాపిల్ తీసుకొచ్చిన ఈ పరికరం చాలామంది జీవితాలను మార్చేసింది.అయితే దీనిని ఎక్కువసేపు వాడటం వల్ల వచ్చే ప్రమాదాలను కూడా యూజర్లు తెలుసుకోవాలి.

చలికాలంలో కాకరకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?