వీడెవడండీ బాబు.. రోటిపై ఆవు పేడ వేసుకుని తినేస్తున్నాడు!
TeluguStop.com
ప్రస్తుత రోజులలో అనేకమంది వారు తీసుకునే ఆహార విషయాలకు వస్తే.వారు ఏమి తింటున్నారో కూడా అర్థం కానీ పరిస్థితులలో ఉన్నారేమో అనిపిస్తుంటుంది.
అందుకు తగ్గట్టుగానే మనం తినే ఆహారాలు కూడా అలానే ఉన్నాయి.ఇక కొంతమంది వివిధ రకాల విచిత్రమైన వంటకాలు తింటూ ఉంటే.
మరికొందరు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫుడ్ ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు.
"""/" /
ప్రస్తుత రోజులలో చాలామంది గోవుల సంరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు.
అలాగే గోమూత్రం, గో మలంతో అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రజలలో ఒక నమ్మకం కూడా బాగానే ఉంది.
అయితే, తాజాగా ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా చేతిలో ముందుగా రోటి( Roti ) పట్టుకొని ఆవుపేడ( Cow Dung ) ముందు కూర్చున్నాడు ఓ వ్యక్తి.
"""/" /
అనంతరం ఆ పేడను రోటి మీద సాస్ మాదిరిగా పూసుకొని రోల్ లాగా చేసుకుని దానిని తినడం మొదలుపెట్టాడు.
అంతేకాకుండా అమోఘం అంటూ తల ఊపుకుంటూ తినడం మనం వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన కొంత మందిని నెటిజన్స్ అయితే "వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా" అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు అయితే "తు యాక్ ఎలా తినబుద్ది అవుతుంది భయ్యా " అంటూ కామెంట్ చేస్తున్నారు.
పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?