భార్య శవంతో స్కూటీపై ఊరేగిన భర్త.. చివరకు..?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా హత్యలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువగా కుటుంబీకులు, బంధువుల ప్రమేయం ఉన్నట్టు తేలుతోంది.తాజాగా ఒక వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు.
ఆ తరువాత చనిపోయిన భార్యను స్కూటీపై ఊరంతా తిప్పాడు.ఈ ఘటన గురించి స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలోని సింధ్ క్యాంప్ కాలనీలో హేమ్ నాని, నైనా దంపతులు జీవించేవారు.
తరచూ ఈ జంట మధ్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరిగేవి.అయితే హేమ్ నాని చిన్నచిన్న విషయాలకు సైతం ఊరికే కోప్పడేవాడు.
అలా నిన్న కూడా ఆ జంట మధ్య గొడవ జరగగా ఆవేశంలో హేమ్ నాని భార్య నైనా గొంతు పిసికి చంపేశాడు.
అయితే ఆ తరువాత భార్య శవాన్ని ఏం చేయాలో హేమ్ నానికి అర్థం కాలేదు.
తన దగ్గర స్కూటీ మాత్రమే ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా భార్యను స్కూటీపై తీసుకెళ్లి అడవిలో శవాన్ని పడేయాలని హేమ్ నాని అనుకున్నాడు.
ప్లాన్ ప్రకారమే భార్య శవాన్ని స్కూటీపై ఉంచి ఊరంతా తిరిగాడు.అయితే స్థానికులకు వెనుక సీటులో కూర్చున్న నైనా చనిపోయిందని అర్థమైంది.
దీంతో హేమ్ నానిని ఆపడానికి ప్రయత్నించగా అతను మాత్రం వేగంగ స్కూటీని వేగంగా నడిపి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఏం చేయాలో పాలుపోని స్థానికులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు.
పోలీసులు హేమ్ నానిని అదుపులోకి తీసుకొని ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు కారణమైన గొడవ గురించి పోలీసులు నిందితుని నుంచి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు లక్ కలిసిరావడం లేదా.. ఈ డైరెక్టర్ కు సమస్య ఇదేనా?