ప్రేమికుల కోసం ప్రత్యేకమైన గొడుగు.. వీడియో చూస్తే ఫిదా..??
TeluguStop.com
ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ వేడి నుంచి ఉపశమనం అందిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వల్ల నష్టాలు కూడా సంభవించాయి.అయితే ఈ కాలంలో చాలా ముఖ్యమైన వస్తువు గొడుగు.
( Umbrella ) ఈ రైనీ సీజన్‌లో బయటికి వెళ్లినప్పుడు దీనిని తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
సాధారణంగా, ఒక గొడుగు ఒక వ్యక్తిని మాత్రమే వర్షం నుంచి రక్షించగలదు.ప్రేమికుల లేదా భార్యాభర్తలు ఒకే గొడుగు కింద పట్టలేరు.
దీనివల్ల వాళ్లు తడిచిపోతారు.అయితే ఒక వ్యక్తి దీనికి పరిష్కారం కనుగొన్నాడు.
కపుల్స్ కోసం స్పెషల్ అంబ్రెల్లా( Couples Umbrella ) తయారు చేశాడు.అది రెండు గొడుగులుగా పెద్దగా విచ్చుకుంటుంది కానీ ఓకే గొడుగులు వలె క్లోజ్ అవుతుంది.
ఒకఈ గొడుగు కింద ఎలా ఉండాలో చూపించే ఒక వీడియో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది.
ఈ క్లిప్ షేర్ చేసిన సమయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొత్త గొడుగు సింగిల్స్‌కు పనికిరాదని అనిపిస్తుంది. """/" /
ఈ గొడుగు సగం నలుపు, సగం గులాబీ రంగులో ఉంటుంది.
దీనిని తెరిచినప్పుడు, గొడుగు వెడల్పు పెరుగుతుంది, తద్వారా ఇద్దరు వ్యక్తులు దాని కింద ఉండవచ్చు.
ఈ గొడుగు హ్యాండిల్ రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది.అశిష్ సావంత్( Ashish Sawant ) అనే వ్యక్తి ఈ వీడియోలో ఆ గొడుగును వివాహితులు మాత్రమే లేదా లవర్స్( Lovers ) ఉపయోగించగలరని చెబుతాడు.
ఆ గొడుగును పరిచయం చేస్తూ ఒక బటన్‌ను అన్‌లాక్ చేసి, ఆపై హ్యాండిల్‌పై మరొక బటన్‌ను నొక్కడం ద్వారా ఓపెన్ చేస్తాడు.
ఇది చాలా సౌకర్యవంతంగా, సులభంగా కనిపించే భారీ గొడుగుగా విస్తరిస్తుంది. """/" /
కపుల్స్ అంబ్రెల్లా ఆలోచన ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది, చాలా మంది సింగిల్స్ అయినా ఈ గొడుగును కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
"ఒప్పెన్‌హైమర్, బార్బీ సినిమా విడుదల సమయంలో దీన్ని లాంఛ్ చేసి ఉంటే బాగుండేది, కచ్చితంగా బాగా అమ్ముడయ్యేది" అని ఒక వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
"నేను, నా ఒంటరితనం ఇద్దరూ ఈ గొడుగు కింద నడుస్తాం" అని మరొకరు కామెంట్ చేశారు.
"అవివాహితులు మూలలో ఏడుస్తున్నారా?" అని ఒకరు ఫన్నీగా కామెంట్ పెట్టారు.వివాహితులకు మాత్రమే ఎందుకు, స్నేహితులు కూడా దీనిని ఉపయోగించవచ్చు అని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఈ క్లిప్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 97 లక్షల వ్యూస్ వచ్చాయి.
వీడియో: బెంగళూరు ఎయిర్‌పోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన జపాన్ ట్రావెల్ వ్లాగర్..