New York : న్యూయార్క్ బిజీ స్ట్రీట్‌లో పాడు పని.. పబ్లిక్ డస్ట్‌బిన్‌లోనే మలవిసర్జన..!
TeluguStop.com
ఇటీవల కాలంలో న్యూయార్క్( New York ) నగరంలో మనుషులు బహిరంగంగానే చెత్త పనులు చేస్తూ చాలామందికి షాక్‌లిస్తున్నారు.
పబ్లిక్‌లోనే నగ్నంగా స్నానాలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు పడేయడం కామన్ అయిపోతోంది.
సాధారణంగా యూఎస్ అంటే హై టెక్నాలజీ, క్లీన్ వీధులతో కూడిన ప్రదేశం అని ఇతర దేశాల ప్రజలు భావిస్తారు.
కానీ ఇటీవల కాలంలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే ఆ భావన తప్పు అని తెలుస్తోంది.
అమెరికన్ నగరాల చీకటి కోణాన్ని వీడియోలు తెలియజేస్తున్నాయి.తాజాగా న్యూయార్క్ సిటీలో నివసించే ఓ వ్యక్తి ఓ బిజీ రోడ్డులో ఉంచిన డస్ట్‌బిన్‌లో( Dust Bin ) మల విసర్జన చేశాడు.
దీనిని ఓ వ్యక్తి వీడియో తీశారు.ఆ వీడియోలో మధ్యాహ్న సమయంలో చెత్త కుండీలో విసర్జన చేసిన ఓ వ్యక్తి కనిపించాడు.
ఫిఫ్త్ అవెన్యూ, 43వ వీధికి సమీపంలో ఉన్న మాన్‌హాటన్‌లోని వీధిలో( Manhattan Street ) ఈ సంఘటన చోటు చేసుకుంది.
అతను ఆరంజ్ కలర్ ప్యాంటు, బ్లూ కలర్ జాకెట్ ధరించాడు.అతని దగ్గర టాయిలెట్ పేపర్ కూడా ఉంది.
"""/" /
వీడియో తీసిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతూ."ఇది చూడండి, ఇది ఫిఫ్త్ ఎవెన్యూ, 43వ వీధిలో ఉంది.
అతను ఇప్పుడే ఆ చెత్త కుండీపైకి ఎక్కి, తన ప్యాంట్‌ని కిందకి లాగి, మలవిసర్జన( Defecation ) చేయడం ప్రారంభించాడు.
ఇది నమ్మశక్యంగా లేదు.ఈ నగరంలో మనుషులు మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
" అని అన్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది వైరల్ అయింది.
ఈ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేయగా దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేశారు.
"""/" /
చెత్త కుండీని మలవిసర్జనకు వాడితే తప్పేంటి ఓ వ్యక్తి చమత్కరించాడు.
వీధిలో కాకుండా చెత్త కుండీని ఉపయోగించి సదరు వ్యక్తి సరైన పని చేశాడని మరొక వ్యక్తి చెప్పాడు.
ఇది నగరానికి శుభసూచకమని ఇంకొందరు సటైర్స్ పేల్చారు.అయితే కొంతమందికి ఆ వీడియో నచ్చలేదు.
ఒక వ్యక్తి యాక్ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.నగరంలో తగినంత పబ్లిక్ రెస్ట్రూమ్‌లు లేవని, అవి ఖరీదైనవని మరికొందరు పేర్కొన్నారు.
రాజమౌళి సినిమా వల్ల ఆ థియేటర్ ను సీజ్ చేశారట.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?