వేగంగా బస్సు వస్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి.. ఎలా తప్పించుకున్నాడో చూడండి..
TeluguStop.com
రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసి వాహనాలు రానప్పుడు మాత్రమే దాటాలి.
ఈరోజు పాటించకుండా అసహనంగా రోడ్లు క్రాస్ చేస్తూ( Road Crossing ) చాలామంది ప్రమాదాలకు గురయ్యారు.
రోడ్డు దాటేటప్పుడు నిర్లక్ష్యంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే పాదాచారులకే కాకుండా వాహనదారులకు కూడా ప్రాణ హాని ఉంటుంది.
అందుకే రోడ్లపై బాధ్యతగా వ్యవహరించుకోవలసిన అవసరం ఉంది కానీ కొందరు యువకులు మాత్రం తమకు ఏమవుతుందిలే అని చావుకి ఎదురుగా వెళ్తున్నారు.
వాహనాలు( Vehicles ) వస్తున్నా రోడ్లను హడావుడిగా దాటేస్తున్నారు.ఒక్క క్షణం ఆగితే ప్రాణాలు, గాయాలు తప్పించుకునే అవకాశం ఉంటుందని వారు అసలు ఆలోచించడం లేదు.
మరికొందరు సెల్ ఫోన్లు చూస్తూ క్రాస్ చేస్తున్నారు.తాజాగా ఒక యువకుడు బస్సులు, వ్యాన్లు వస్తున్న ఒక బిజీ రోడ్డును( Busy Road ) ప్రమాదకర రీతిలో దాటాడు.
దానికి సంబంధించిన @enezator ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు.ఈ క్లిప్ కు 32 లక్షల వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చాయి.
"""/" /
వైరల్ వీడియో( Viral Video ) క్లిప్ ప్రకారం, ఒక వ్యక్తి చాలా బిజీగా ఉన్న రోడ్డును క్రాస్ చేయాలనుకున్నాడు.
ఆ సమయంలో ఒక బస్సు( Bus ) అతని వైపుగా వేగంగా వస్తోంది.
అయినా అతడు రోడ్డు దాటడం మొదలుపెట్టాడు.ఇంతలోనే బస్సు చాలా దగ్గరగా వచ్చింది.
ఇక ఢీకొడుతుందేమో అనగా ఆ వ్యక్తి వెంటనే పడుకున్నాడు.చక్రాల మధ్య గ్యాప్‌లో అతడు పడుకున్నాడు, బస్సు అతడు పైనుంచి వెళ్ళిపోయింది.
తర్వాత అతడు లేచి రోడ్డుపై నుంచి అవతలి వైపుకు పరిగెత్తాడు. """/" /
ఆ సమయంలో కారు, ట్రక్ వంటి వాహనాలు రోడ్లపై దూసుకెళుతున్నాయి.
అతడిని ఏదైనా వాహనం ఢీకొడుతుందేమో అని అనిపించింది.కానీ అదృష్టం కొద్దిగా అతడు సేఫ్‌గా రోడ్డు దాటగలిగాడు.
వాస్తవానికి ప్రతి ఒక్కరూ రోడ్లపై రెస్పాన్సిబుల్ గా ఉండాలి.ఎప్పుడైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మాకేం కాదులే అని రిస్కీ స్టంట్స్ చేస్తే ఏదో ఒక సమయంలో స్టంట్ బెడిసి కొట్టి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
ఈ వీడియో చూస్తుంటే చాలా భయమేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.
ఆ పని మరే హీరో చేయలేరు… అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక