కదిలే ఆటో తోట.. లోపల కూర్చుంటే చల్లని నీడ!

ఢిల్లీ నివాసి మహేంద్ర వేడి నుండి తప్పించుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఉపాయాన్ని కనుగొన్నాడు.

మహేంద్ర సింగ్ గత 25 ఏళ్లుగా ఆటోలు నడుపుతున్నాడు.ఆటోలో వేడిని తరిమికొట్టడానికి, అతను తన ఆటో పైకప్పుపై అందమైన తోటను ఏర్పాటు చేశాడు.

ఒక రోజు వేడి తాళలేక ఇబ్బంది పడి, ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నానని, కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నానని, కళ్ళు తెరవగానే, తన మనసులో తన ఆటోపై చెట్లు నాటాలనే ఆలోచన వచ్చిందని మహేంద్ర చెప్పాడు.

ఈ ఆటో గార్డెన్‌లో మహేంద్ర 23 రకాల మొక్కలను నాటాడే.ఇందులో కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి.

అంతే కాకుండా ఈ తోటలో గోధుమ మొక్కలను కూడా నాటారు.ఆటోలోకి వచ్చే పూల పరిమళం ప్రయాణీకులను బాగా ఆకర్షిస్తుంది, ఆటో లోపల నలుగురు ప్రయాణీకులు కూర్చోవచ్చు.

ఆటోలోని ఈ ఫ్యాన్ సహాయంతో, పైనున్న గార్డెన్‌లోని గాలి ప్రయాణీకులను తాకుతుంది.ఇది కూలర్‌గా పనిచేసి ఆటోను పూర్తిగా చల్లగా ఉంచుతుంది.

మహేంద్రను చూసిన మరికొందరు ఆటో డ్రైవర్లు అతడి నుంచి పలు వివరాలు తెలుసుకుంటున్నారు.

గత కొన్నేళ్ల కంటే ఈసారి ఢిల్లీలో వేడి అత్యధికంగా ఉంది.ఈ ఆటో తోట వల్ల తనకు ఇంత మేలు జరుగుతుందని గ్రహించలేదని మహేంద్ర పేర్కొన్నాడు.

పుష్ప2 రిలీజ్ వేళ సంచలన పోస్ట్ పెట్టిన నాగబాబు… మళ్లీ కలుసుకోలేవు అంటూ!