కరోనా వైరస్ కి భయపడి రోగి ఏకంగా…

ప్రస్తుత కాలంలో కొందరు కరోనా వైరస్ గురించి లేనిపోని భయాందోళనలకు గురవుతూ అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి గురవుతున్నారు.

 తాజాగా ఓ వ్యక్తి కి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి మార్కాపురం మండలం లోని ఓ గ్రామంలో రాధా కృష్ణ అనే వ్యక్తి కి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు వైద్యాధికారులు నిర్వహించారు.

ఈ క్రమంలో ఆ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వెంటనే వైద్యాధికారులు హుటాహుటిన జిల్లా కేంద్రమైన ఒంగోలు లో ఉన్నటువంటి ఆసుపత్రి క్వారంటైన్  భవానాని కి తరలించారు.

దీంతో కరోనా కారణంగా తీవ్ర మనోవేదనకు గురైనటువంటి రాధాకృష్ణ భవనం పైకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా ఈ విషయం ఒంగోలు జిహెచ్ఎంసి ఆసుపత్రిలో కలకలం సృష్టించింది.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వైద్యాధికారులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అలాగే ఆస్పత్రి వైద్య అధికారులు ఈ విషయం గురించి స్పందిస్తూ కరోనా వైరస్ సోకిన టువంటి రోగులు వైద్యుల సంరక్షణలో ఉంటే కోలుకోవచ్చని కాబట్టి అవగాహన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

అబ్బా.. పిల్ల సింహలలో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో