వావ్, బాహుబలిలో ప్రభాస్ లాగా ఏనుగుపైకెక్కిన వ్యక్తి.. వీడియో వైరల్..!
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
ఇందులో ప్రభాస్ ఏనుగు నెక్కిన సీన్ ఒక హైలెట్ అని చెప్పవచ్చు.ఈ సన్నివేశంలో ప్రభాస్ ని తన వీపు మీదకు ఎక్కించుకునేందుకు ఏనుగు తొండాన్ని కింద నుంచి పైకి లేపుతుంది.
ఈ సీన్ స్క్రీన్ పై కనిపించినప్పుడు ప్రేక్షకులు మంత్రముగ్దులవుతుంటారు.అయితే ఇప్పుడు ఈ సీన్ రియల్ లైఫ్ లో కూడా చోటు చేసుకొంది.
అది చూసి నెటిజన్లు బాహుబలి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఈ వీడియో ని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విటర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో మావటి ఒక ఏనుగుపై స్వారీ చేయాలని అనుకుంటాడు.ఇందుకు అతను ఏనుగు ముందుకు వచ్చి నిలబడతాడు.
ఆ తర్వాత ఆ ఏనుగు మావటి కోసం తొండాన్ని కిందకి దించి అతన్ని తన వీపు మీదకి ఎక్కించుకుంటుంది.
ఆ విధంగా ఈ మావటి ఏ సహాయం లేకుండానే ఏనుగు తొండం ద్వారా దాని మీదకి ఎక్కగలుగుతాడు.
ఇది అచ్చం బాహుబలి సినిమాలో లాగానే కనిపించింది.ఈ వీడియోకి 33 వేల వ్యూస్, 2 వేలకు పైగా లైకులు వచ్చాయి.
ఈ బ్యూటిఫుల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.మానవులు, మూగ జంతువుల మధ్య ఇలాంటి అనుబంధం చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten