ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసుకుంటానంటూ రూ.98 వేలు బదిలీ..!

తాజాగా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసుకుంటాననే నెపంతో ఫోన్ తీసుకొని రూ.

98 వేల రూపాయలు వేరే ఖాతాలోకి బదిలీ చేసి చాలా సులువుగా డబ్బులు కొట్టేశాడు.

స్థానికంగా ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.వివరాల్లోకెళితే కాటంవారి పల్లెకు చెందిన కాటం కృష్ణారెడ్డి( Katam Krishna Reddy ) కురిచేడులో ఓ నిత్యవసర వస్తువుల దుకాణంతో ఉపాధి పొందుతున్నాడు.

శుక్రవారం ఉదయం ఓ అపరిచిత వ్యక్తి దుకాణానికి వచ్చి కొన్ని నిత్యవసర సరుకులు కొనుగోలు చేశాడు.

అనంతరం తన దగ్గర నగదు లేదని, తన స్నేహితుడు ఆన్లైన్లో పంపుతాడు ముందుగా తన ఫ్రెండుకు ఫోన్ నెంబర్ ద్వారా ఒక రూపాయి ఫోన్ పే చేయాలని చెప్పాడు.

"""/" / కృష్ణారెడ్డి అలాగే అని చెప్పి తన ఫోన్ నుండి ఫోన్ పే( Phone Pe ) ద్వారా ఆ వ్యక్తి స్నేహితుడి ఖాతాకు ఒక రూపాయి పంపించాడు.

అయితే ఆ అపరిచిత వ్యక్తి కృష్ణారెడ్డి పాస్వర్డ్ ( Password ) టైప్ చేసేటప్పుడు గమనించాడు.

అనంతరం కృష్ణారెడ్డితో ఒకసారి తన ఫ్రెండుతో మాట్లాడుతానంటూ ఫోన్ తీసుకుని, మాట్లాడుతున్నట్లు నటించి రూ.

98 వేల రూపాయలు వేరే ఖాతాకు బదిలీ చేశాడు.తర్వాత కాసేపు మాటలు కలిపి అక్కడినుండి పరారయ్యాడు.

"""/" / కృష్ణారెడ్డికి కాస్త అనుమానం వచ్చి కొద్దిసేపటి తర్వాత ఫోన్ పే లో ఖాతా తెరిచి చూసుకోగా రూ.

98 వేల రూపాయలు వేరే ఖాతాకు బదిలీ అయినట్లు కనిపించింది.చుట్టుపక్కల ప్రాంతానంత జల్లెడ పట్టిన కూడా ఆ అపరిచితుడి జాడ కనిపించలేదు.

ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు కానీ, అపరిచిత వ్యక్తి బదిలీ చేసిన ఖాతా సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటన కురిచెడు లో స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.పోలీసులు అపరిచిత వ్యక్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం ఇలాంటివి ఎన్నో మార్గాలను ఎంచుకున్నారని సూచించారు.

ఓటు వేసేందుకు క్యూ కట్టేస్తున్న మహిళలు .. ఏ పార్టీకి కలిసి వస్తుందంటే ..?