వయసు పెరిగిన బుద్ది పెరగలేదు.. గుడిలో ఆ నీచం పనులేంటో!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా పలు విచిత్రమైన, కలకలం రేపే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వేదికలు ప్రధాన మార్గంగా మారాయి.
తాజాగా, ఓ పవిత్ర దేవస్థానంలో జరిగిన అసభ్యకర ఘటన ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈ వైరల్ వీడియో( Viral Video ) చూసిన ప్రతి ఒక్కరూ వ్యక్తిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
"""/" /
మౌంట్ అబూలోని( Mount Abu ) డెల్వాడ జైన ఆలయం( Delwara Jain Temple ) వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది.
సుమారుగా 50 ఏళ్లు ఉన్న వ్యక్తి ఓ వ్యక్తి ఆలయానికి వచ్చినట్టు కనిపిస్తున్నాడు.
కానీ, అతడి మనసు మాత్రం కుర్రాడిలా కాదు, క్రూరంగా ఉంది.ఓ యువతిని ఆమెకు తెలియకుండా అసభ్యంగా ఫోటోలు తీస్తూ, తరచూ ఆమెను ఫాలో చేస్తూ ఆ యువతిని అసహనానికి గురిచేశాడు.
ఆమె మొదట్లో ఓపికపడి వ్యవహరించినా, చివరికి సహనం కోల్పోయి అతని దగ్గరకు వెళ్లి గట్టి ప్రశ్నలు సంధించింది.
అతని ఫోన్ ఓపెన్ చేయించి, తన కాళ్ల ఫోటోలు ఉన్నదీ చూసి, ఆగ్రహంతో ఊగిపోయింది.
"""/" /
ఆ యువతి అతడిని నిలదీసినప్పటికీ, చుట్టూ ఉన్న వారు ఎవ్వరూ ఆమెకు మద్దతుగా నిలవకపోవడం దురదృష్టకరం.
అయితే, యువతి ధైర్యంగా నిలిచి అతని ఫోన్ లోని ఫోటోలు డిలీట్ చేయించింది.
వీడియోలో స్పష్టంగా అతను తప్పును అంగీకరిస్తూ తలవంచిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రగా ఆగ్రహిస్తున్నారు.చివరకు ఆలయాల్లో కూడా మహిళలకు రక్షణ లేకపోతే, సమాజం ఏ దిశగా పోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు ఇలాంటి కామ కుక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.