వీడియో: అది బొమ్మా, లేదంటే అనకొండ పామా.. అలా పట్టుకున్నావ్ ఏంటి బ్రో..

వెనిజులాలోని( Venezuela ) ఒక చిత్తడి నేలలో హాయిగా సేద తీరుతున్న ఒక అనకొండను( Anaconda ) డిస్టర్బ్ చేశాడు ఒక వ్యక్తి.

దాన్ని బొమ్మలాగా పట్టుకుని దానితో పోజులిచ్చి ఫొటోలు, వీడియోలు దిగాడు.ఆపై ఓ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయగా ఇప్పుడు అది పెద్ద దుమారం రేపుతోంది.

ఆ పనిచేసిన వ్యక్తి పేరు మైక్ హోల్‌స్టన్.( Mike Holston ) 'ది రియల్ టార్జాన్' తనని తాను పిలుచుకుంటాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 10 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇతడు గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే నవంబర్ 15న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియో అతడిని వివాదంలో పడేసింది.

"""/" / ఆ వీడియోలో హోల్‌స్టన్ నీటిలోకి దూసుకెళ్లి, భారీ అనకొండను తోక పట్టుకుని బయటకు తీస్తున్నట్లు కనిపించింది.

ఆ తర్వాత పామును( Python ) తన శరీరానికి చుట్టుకొని, దాని తలను చేతిలో పట్టుకున్నాడు.

పాము అతడి నుంచి విడిపించుకోవడానికి చాలా కష్టపడింది.హాయిగా ఆ పాము నిద్రపోతుంటే దానిని ఇతడు లేపి ఒక బొమ్మలాగా మెలికలు తిప్పుతూ, తను శరీరానికి చుట్టుకుని తెగ ఇబ్బంది పెట్టేశాడు.

పైగా తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు నవ్వుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చాడు.ఈ వీడియోకు 300,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి, అయితే హాల్‌స్టన్ పామును వేధిస్తున్నాడని, దానికి హాని చేశాడని కొందరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మండిపడ్డారు.

"""/" / ఆ మూగ జీవిని ఫోటోల కోసం ఇలా హింసించడం ఏం బాగోలేదని, ఇది చాలా క్రూరమైన చర్య అని మరికొందరు తిట్టిపోస్తున్నారు.

ఫోటోలు వీడియోలు కోసం జంతువులను హింసిస్తున్న వారి సంఖ్య ఈమధ్య ఎక్కువవుతుంది.ప్రాంక్ ( Prank ) పేరిట కుక్కల ఎదుట సింహం బొమ్మలు పెట్టి వాటిని భయపెట్టి ఇంతకుముందు చాలామంది విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.

ఆహారం, ఆశ్రయం లేక అవి బాధపడుతుంటే వాటిని మరింత వీరు బాధపెడుతున్నారు.ఇలాంటి వారిపై కఠిన శిక్షలు తీసుకుంటే గానీ వాటికి ప్రశాంతత ఉండదని యానిమల్ లవర్స్ అంటున్నారు.

130 ఏళ్ల కెమెరాతో రగ్బీ మ్యాచ్ క్యాప్చర్‌.. అందులో ఏం కనిపించిందో చూసి..?