Car Painting Viral : ఇదేందయ్యా ఇది.. కారుపై పెయింట్ వేస్తుంటే అడ్డంగా వచ్చాడు.. చివరికి…

సోషల్ మీడియాలో డైలీ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.వాటిలో కొన్ని చాలా సమాచారం అందిస్తున్నాయి, మరికొన్ని వింతలతో నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాయి.

ఇంకొన్ని వీడియోలు ఉపయోగకరమైన టిప్స్, అద్భుతమైన నైపుణ్యాలను చూపిస్తూ ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తున్నాయి.

అవి మనకు చాలా నేర్పిస్తాయి, అలానే స్ఫూర్తినిస్తాయి.కానీ కొన్ని వీడియోలు చాలా వింతగా ఉంటాయి, అందులో ఏం జరుగుతుందో అర్థం కాదు.

ఇటీవల అలాంటి ఓ వీడియో వైరల్ అయింది, దానిని చూసిన వారందరూ నవ్వుకున్నారు, కొంచెం భయపడ్డారు కూడా.

ఈ వైరల్ వీడియోలో రిలాక్స్‌డ్‌గా ఉన్న ఒక వ్యక్తి నల్లటి కారుపై( Black Car ) వాలినట్లు కనిపించింది.

ట్విస్ట్ ఏంటంటే అతని వెనుక ఉన్న మరొక వ్యక్తి కారుకు తెల్లని పెయింట్( White Paint ) వేయడానికి అక్కడికి వస్తాడు.

మొదటి వ్యక్తి కారుకి అలాగే అనుకుని ఉంటాడు.ఇది చూసి కూడా మరొక వ్యక్తి కారుకు పెయింట్ చేస్తుంటాడు.

అడ్డుగా ఉన్న వ్యక్తి వెనుక భాగంలోనూ తెల్లగా పెయింట్ చేయడం మనం చూడవచ్చు.

పెయింటింగ్ పూర్తి అయ్యాక సదరు వ్యక్తి కారు నుంచి దూరంగా వెళ్తాడు, అప్పుడు కారుపై పెయింట్ లేని ప్రాంతంలో అతడి ఆకృతికి సరిపోయే ఒక విచిత్రమైన బొమ్మ కనిపిస్తుంది.

"""/" / ఈ వీడియో ఇక్కడితో ఆగిపోతుంది, అయితే కారు అలాంటి బొమ్మను క్రియేట్ చేయడానికి ఆ వ్యక్తి చూపించిన సృజనాత్మకతకు చాలామంది ఫిదా అవుతున్నారు.

ఈ చమత్కారమైన ఇంకా తమాషా ఆలోచన వారికి రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు.

వీడియోకు “బాయ్స్ విల్ బీ బాయ్స్”( Boys Will Be Boys ) అనే క్యాప్షన్ జోడించారు.

మగవారు ఇలాంటి ఫన్నీ థింగ్స్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు నవ్విస్తూనే ఉంటారు అని వీడియో చూసిన ఒక వ్యక్తి అన్నారు.

"""/" / ఈ వీడియో చూసిన వారి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి.

కొందరికి ఇది చాలా ఫన్నీగా అనిపించింది.యువకులు ఆడుకుంటున్న ఈ వీడియో ఎవరికీ హానిచేయని జోక్ అని భావించారు.

మరికొందరు ఇలాంటి చేష్టలు కారణంగా ఏమీ కాదా అని సందేహం వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి "ఇది అంత మంచిది కాదు" అని అన్నాడు.చిలిపి చేష్టలు చివరికి చిక్కుల్లో పడేస్తాయని అతని అభిప్రాయం.

వైసీపీ లో దడ పుట్టిస్తున్న అరెస్ట్ లు ? నెక్స్ట్ ఎవరో ?