కోతికే కాదండోయ్ అక్కడ శునకానికీ గుడి కట్టారు!

దేవుళ్లకు, ఇష్టమైన వ్యక్తులకు మన దేశంలో ]గుడి కట్టడం చాలా అరుదైన విషయం.

కానీ జంతువులకు కూడా గుడి కడుతున్నారు పలువురు.అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కోతికి ఆలయాన్ని నిర్మించారు.

అలాంటి ఘటనే కర్ణాటక జిల్లాలో చోటు చేసుకుంది.కానీ కోతికి కాకుండా శునకానికి ఆలయం నిర్మించారు.

అసలు గ్రామ సింహానికి గుడి ఎందుకు కట్టారు? ఎవరు కట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలోని రాణిబెన్నూరుకు చెందిన చంద్ర శేఖర స్వామికి శనకాలు అంటే చాలా ఇష్టం.

13ఏళ్ల క్రితం ఓ కుక్కను పెంచుకున్నాడు.ఆ కుక్కకు రాజా అని పేరును కూడా పెట్టాడు.

రాజా అంటే స్వామికే కాదు.అతని కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇష్టం.

ఐతే వయసు రీత్యా శునక రాజం చని పోయింది.చాలా రోజుల పాటు రాజా కోసం చాలా బాధపడ్డాడు.

అలాగే శునకం మీద ప్రేమతో ఇంటి దగ్గరే గుడి కట్టించాడు.గ్రామ సింహం ప్రతిమకు నిత్యం పూజలు చేస్తూ ప్రేమ చాటుకుంటున్నాడు.

అంతే కాకుండా గ్రామ సింహం ప్రతిమకు వెనుక భాగంలో శివుడి విగ్రహాన్ని పెట్టి కుక్కను రుద్రుని స్వరూపంగా భావించి పూజలు చేస్తున్నాడు.

అంతే కాదండోయ్ రాజా మీద ప్రేమతో.తన పెంపుడు శునకాలను కూడా పెంచుకుంటున్నాడు.

వాటికి అర్జున, నకుల, సహదేవ అనే పేర్లనుx కూడా పెట్టుకున్నాడు.ఈ గుడికి కేవలం స్వామి కుటుంబ సభ్యులే కాకుండా.

గ్రామస్థులు కూడా పూజలు చేస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ…