వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!

సోషల్ మీడియా.నేడు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మందిని ఆకర్శించిన ఓ మీడియా అని చెప్పుకోవచ్చు.

ఇందులో ఎందరో జనాలు మునిగిపోయి తమ సమయాన్ని వృధా చేసుకుంటే, కొంతమంది మాత్రం తమకి ఉపయోగకరమైన దానికోసమే సోషల్ మీడియాని వాడుకుంటూ లాభాన్ని పొందుతూ ఉంటారు.

అందులో సమాచారం అనేది ఒకటి.నేడు సమాచారాన్ని ఎక్కువగా జనాలకి తెలియజేసేది సోషల్ మీడియానే అని వేరే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దాంతోనే ప్రపంచం నలుమూలలా ఉన్న సమాచారాన్ని మనం క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలోనే ఓ సమాచారం చూసి జనాలు అవాక్కవుతున్నారు.

"""/" / అవును, సాధారణంగా నాణేలతో మనం గుడులకు, గోపురాలకు, షాపులకు వెళ్లడం అనేది సర్వసాధారణం.

అయితే అదే నాణేలను( Coins ) పట్టుకొని కోర్టుకి వెళ్లేవారిని ఎపుడైనా చూసారా? అవును, ఓ వ్యక్తి ఏకంగా కోర్టుకు.

( Court ) నాణేల సంచులను తీసుకువెళ్లారు.ఆయన ఒక్కరే వాటిని లోపలికి మోసుకు వెళ్తూ ఉండగా.

పలువురు వీడియో తీసి, నెట్టింట పోస్ట్ చేయగా.ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

అయితే ఆయన ఆ నాణేలను కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి.

"""/" / తమిళనాడులోని కోయంబత్తూర్‌కు( Coimbatore ) చెందిన 37 ఏళ్ల వ్యక్తి.

సొంతంగా ఓ కారు కొనుక్కుని మరీ ట్యాక్సీ డ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితమే ఓ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు.

కానీ వారికి పిల్లలు కలగలేదు.మొదట్లో బాగానే ఉన్న ఈ జంట మధ్య తర్వాత మనస్పర్థలు రావడంతో ఆయన భార్య గతేడాది విడాకులు( Divorce ) కావాలంటూ కోయంబత్తూరులోని కుటుంబ న్యాయస్థానానికి వెళ్లింది.

ఈ క్రమంలో వీరిద్దరినీ కలిపేందుకు కోర్టు చాలా సార్లు కౌన్సిలింగ్ ఇప్పించినా.ఆ ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టాయి.

దీంతో న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.అయితే మధ్యంతర భరణం కింద ఆమెకు 2 లక్షల రూపాయలు చెల్లించాలని భర్తకు ఆదేశాలు ఇవ్వగా, సదరు వ్యక్తి ఇప్పుడే రెండు లక్షల రూపాయలు చెల్లించలేనని.

80 వేలు మాత్రం ఇవ్వగలనని కోర్టుతో చెప్పాడు.దానికి కోర్టు అంగీకరించడంతో పాటుగా తమ ముందే మహిళకు భరణం కింద చెల్లించాల్సిన డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈక్రమంలోనే అతడు ఓరోజు కోర్టుకు 80 వేల రూపాయల విలువ చేసే రూ.

1, రూ.2 నాణేలు గల 20 బస్తాలను కోర్టుకు తీసుకు వచ్చాడు.

కట్ చేస్తే, ఆ చిల్లరను చూసిన న్యాయమూర్తి.దాన్ని నోట్లుగా మార్చి మహిళకు చెల్లించాలని చెప్పగా.

వాటిని మళ్లీ ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?