రెండు కుక్కలతో సర్ఫింగ్ బోర్డుపై సాహసాలు చేసిన వ్యక్తి.. అబ్బురపరిచే వీడియో వైరల్..!

రెండు కుక్కలతో సర్ఫింగ్ బోర్డుపై సాహసాలు చేసిన వ్యక్తి అబ్బురపరిచే వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

రెండు కుక్కలతో సర్ఫింగ్ బోర్డుపై సాహసాలు చేసిన వ్యక్తి అబ్బురపరిచే వీడియో వైరల్!

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలతో పాడిల్ బోర్డ్‌పై సర్ఫింగ్ చేస్తున్నట్లు కనిపించింది.

రెండు కుక్కలతో సర్ఫింగ్ బోర్డుపై సాహసాలు చేసిన వ్యక్తి అబ్బురపరిచే వీడియో వైరల్!

మొదట రెండు కుక్కలు సర్ఫింగ్ బోర్డ్‌పై వెళ్తున్నప్పుడు పాడిల్ బోర్డ్‌పై ఏమాత్రం భయపడకుండా నిల్చున్నాయి.

ఇంతలోనే ఒక పెద్ద అల రావటంతో ఆ కుక్కలు కంగారు పడ్డాయి.దీంతో ఆ వ్యక్తి తన వీపు మీదకి ఎక్కాలని ఒక కుక్క కి సైగ చేసాడు.

వెంటనే ఆ కుక్క అతని వీపుపై నిలబడగా ఇంకొక కుక్క సర్ఫింగ్ బోర్డ్‌పై నిల్చుంది.

10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నా ఆ కుక్కలు చలించలేదు.అయితే వీపుపై నిల్చున్న కుక్కకి కాస్త భయం వేయడంతో అది బోర్డు ముందు భాగంలోకి దూకింది.

సర్ఫింగ్ పూర్తయ్యాక ఒడ్డు మీదకు వచ్చిన అనంతరం కుక్కలు చాలా ఉపశమనంగా, హ్యాపీగా ఫీల్ అయ్యాయి.

ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.దీనికి ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్, 23 వేలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కుక్కలకు సముద్రం అలవాటు చేస్తున్న ఈ వ్యక్తిని చాలా మంది నెటిజన్లు పొగుడుతున్నారు.

"శునకాలకు సర్ఫింగ్ ఎలా నేర్పావ్ భయ్యా, ఇది అద్భుతమైన సాహసం" అని ఇంకొందరు ఆశ్చర్యంతో కామెంట్లు చేస్తున్నారు.

ఈ అమేజింగ్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

ఆ కారణంతోనే పిల్లలను వద్దనుకున్నాం… డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు! 

ఆ కారణంతోనే పిల్లలను వద్దనుకున్నాం… డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు!