Mammootty: తెలుగులో మమ్ముటి నేరుగా నటించిన సినిమాలు ఇవే .. !

మలయాళ నటుడు మమ్ముటి( Mammootty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

మాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆయన ఒక మెగాస్టార్ అనే చెప్పాలి.ఆయన 52 ఏళ్ళ సినీ ప్రస్థానం లో 400కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆయన.

ఎక్కువగా మలయాళ సినిమాలోనే నటిస్తూ వచ్చిన మమ్ముట్టి తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ తనదైన ముద్రవేశారు.

13 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 3 జాతీయ పురస్కారాలతో పాటు ఏడు కేరళ స్టేట్ అవార్డ్స్ సైతం ఆయన సొంతం చేసుకున్నారు.

అంతేకాకుండా చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1998లో పద్మశ్రీ పురస్కారాన్ని( Padma Shri Award ) కూడా అందించింది.

ఇక 2022 లో కేరళ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారమైన కేరళ ప్రభ అవార్డుతో మమ్ముటి ని సత్కరించారు.

ఇక తెలుగులో మమ్ముట్టి నేరుగా నటించిన సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఆయన కేవలం నాలుగు తెలుగు చిత్రాల్లో మాత్రమె నటించారు.

1991లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం లో వచ్చిన 'స్వాతి కిరణం'( Swati Kiranam Movie ) మమ్ముట్టికి తెలుగులో ఫస్ట్ స్ట్రయిట్ మూవీ.

ఈ సినిమా లో అనంత రామశర్మ పాత్రలో జీవించేశారాయన.ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

"""/" / సంగీతభరితంగా సాగే ఈ సినిమాకి మమ్ముటి నటన ఓ ప్రధాన బలంగా నిలిచింది.

ఈ సినిమా తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywod ) నుండి దాదాపు 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు మమ్ముటి.

ఇక ఐదేళ్లు విరామం తరువాత 1996లో 'సూర్య పుత్రులు' సినిమా లో( Surya Puthrulu Movie ) నటించారు మమ్ముట్టి.

 సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమన్, నగ్మా, శోభన లాంటి నటినటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఆ తరువాత కూడా చాలా కాలం తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు.

సుదీర్ఘ విరామం అనంతరం 2019లో 'యాత్ర' సినిమా లో( Yatra Movie ) మళ్లీ కనిపించారు మమ్ముటి.

"""/" / మహి వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో మాజీ ముఖ్యమంత్రి వై.

ఎస్.రాజశేఖర రెడ్డి( YS Rajasekhar Reddy ) పాత్రలో అద్భుతంగా నటించారు మమ్ముటి.

ఇక రీసెంట్ గా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్'( Agent Movie ) మూవీ మమ్ముట్టి లో దర్శనమిచ్చారు.

ఇది ఆయన నాలుగవ తెలుగు సినిమా.సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లో మమ్ముట్టి ఓ స్పెషల్ పాత్రలో నటించారు.

భవిష్యత్ లో కూడా మమ్ముటి తెలుగు సినిమా లో విభిన్న పాత్రలతో పలకరిస్తారేమో చూడాలి.

అఫీషియల్… చరణ్ గేమ్ చేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్… ఎప్పుడంటే?