పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే ఏడాది జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది.
నేడు హస్తిన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది.
కేజ్రీవాల్‌ను ఓడిరచేందుకు వారు చేసిన ప్రతి ప్రయత్నంను కూడా ఓటర్లు తిప్పి కొట్టారు.
త్వరలోనే వారికి మరో షాక్ కూడా పశ్చిమబెంగాల్ ఓటర్లు ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.2021లో జరుగబోతున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యంక్రియలు ఖాయం అంటూ ఈ సందర్బంగా మమత బెనర్జీ చెప్పుకొచ్చింది.
మోడీ ప్రభావం అంటూ బీజేపీ నేతలు ఇక చెప్పుకోవడం ఆపే స్థితికి ఆయన పరిస్థితి వచ్చింది అంటూ ఆమె పేర్కొన్నారు.
దేశంలో ప్రతి చోట కూడా బీజేపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ ఇక సర్దేసుకోవాల్సిందే అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
నేడు వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు అంటూ ఆప్ నాయకులు అంటున్నారు.
కేజ్రీవాల్‌ను వారు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.కాని న్యాయం గెలిచిందన్నారు.