కేంద్రం పై మమత గరం గరం.. !

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ కేంద్రానికి ఏ విషయంలో పొత్తు కుదరలేదో గానీ ఇద్దరి మధ్య పచ్చగడ్ది వేస్తే భగ్గుమనేలా ఉంటుందన్న విషయం తెలిసిందే.

మమత విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా చాలు కమళం నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తారు.

అదే సమయంలో మమతా బెనర్జీ కూడా ఆ విమర్శలకు ధీటుగానే సమాధానాలు చెబుతారు.

ఇలా కేంద్రం, మమత ఒక చూరు కిందకి చేరడం, సమన్వయంతో రాజకీయాలు చేయడం దాదాపుగా కలగా మారిపోతుంది.

ఇదిలా ఉండగా వీరి రాజకీయ గొడవల్లోకి ట్వీట్టర్ ను లాగారు.ఈ అంశం పై మమత కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ట్విట్టర్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, అది సాధ్యం కాకపోవడంతో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఆలోచనలు చేస్తుందని ఆరోపించారు.

ఇదే కాకుండా తమ ప్రభుత్వంపై కూడా అహంకార ధోరణిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.

పవన్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. హరిహర వీరమల్లు విషయంలో జరగబోయేది ఇదేనా!